27 నుండి నేరుగా రైతుల ఖాతాల్లోకి రైతు బంధు సాయం – కేసీఆర్

ఈ నెల 27 నుంచి జనవరి 7 వరకు రైతుబంధు సాయం అందించాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, సోమవారం రోజు అధికారులను ఆదేశించారు. రైతుబంధు పథకంపై వ్యవసాయ, ఆర్థిక శాఖ అధికారులతో కేసీఆర్ సమావేశమయ్యారు. ‘‘రాష్ట్రంలో ప్రతి ఒక్క రైతుకూ రైతుబంధు సాయం అందించాలి. రైతుల ఖాతాలోనే నేరుగా డబ్బు జమ చేయాలి. రైతుబంధు కోసం రూ.7,300 కోట్లను విడుదల చేయాలి’’ అని అధికారులను కేసీఆర్ ఆదేశించారు.