శేఖర్ కమ్ముల ‘ఫిదా’ సినిమాతో తనకంటూ ప్రత్యేకమైన ఫాలోయింగ్ సంపాదించుకుంది ముద్దుగుమ్మ సాయి పల్లవి.
ఫిదా తర్వాత విడుదలైన ‘ఎంసిఏ’ కూడా హిట్ కావడంతో వరుస అవకాశాలు వచ్చాయి.
శర్వానంద్ తో ‘పడిపడి లేచే మనసు’, సూర్యతో ‘ఎన్జీకే’, ధనుష్ తో ‘మారి 2’ లాంటి సినిమాలు ఇలా వచ్చి అలా వెళ్లిపోవడంతో తెలుగులో కూడా సాయి పల్లవి ఇమేజ్‌ను బాగానే దెబ్బ తీసాయి.
స్క్రిప్ట్ డిమాండ్ చేసినా కూడా తను మాత్రం లిప్ లాక్ సీన్స్ అయినా.. హాట్ సన్నివేశాల్లో అయిన దూరంగా ఉంటానని ఇది వరకే చెప్పింది సాయి పల్లవి.
ప్రస్తుతం నాగ చైతన్యతో ‘లవ్ స్టోరీ’ సినిమా పూర్తి చేసుకుంది. సమ్మర్ లో ఈ సినిమా విడుదల కానుంది.
రానా దగ్గుబాటితో ‘విరాట పర్వం’ సినిమాలోను నటిస్తుంది సాయి పల్లవి. ‘విరాటపర్వం’ పోస్టర్ లో సాయి పల్లవి, రానా దగ్గుపాటి జంటగా కనిపించి తీరు అందరిని ఆకట్టుకుంది.
నానితో ‘శ్యామ్ సింగ రాయ్’ సినిమాల్లోనూ చేస్తుంది సాయి పల్లవి.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా సినిమాలోను సాయి పల్లవి ఛాన్స్ కొట్టేసినట్లుగా వినిపిస్తోంది. ఈ సినిమా కోసం రెమ్యూనరేషన్ కూడా పెంచేసిందట ఈ బ్యూటీ.
ఇలా వరుస సినిమాలతో సాయి పల్లవి 2021 లో బిజీ ఉన్న హీరోయిన్ లలో టాప్ ఉంది. ఇప్పుడు ఈమె చేతిలో ఉన్న సినిమాలు కూడా చాలా ఆదరణ పొందే సినిమాలే కావడంతో సాయి పల్లవి 2021 క్యాలెండర్ ఆమె కెరీర్ లో టర్నింగ్ పాయింట్ అనే చెప్పాలి.
13 Comments