సామ్ జామ్ సంక్రాంతి ఎపిసోడ్ లో కుటుంబ సమేతంగా మహేష్ బాబు
Timeline

సామ్ జామ్ సంక్రాంతి ఎపిసోడ్ లో కుటుంబ సమేతంగా మహేష్ బాబు

అక్కినేని సమంత హోస్ట్ చేస్తున్న ‘సామ్ జామ్’ ప్రోగ్రాంలో మెగాస్టార్ చిరంజీవి భాగమైన సంగతి తెలిసిందే. ఈ ప్రోగ్రాంలో మెగాస్టార్ లైఫ్ లోని అనేక విషయాలను రాబట్టి ఎంటర్‌టైన్ చేసింది సమంత. ఈ ఎపిసోడ్ క్రిస్మ‌స్ కానుక‌గా డిసెంబ‌ర్ 25న టెలికాస్ట్ అయింది. ఆహా వేదికపై న్యూ ఇయర్ కానుకగా ప్రసారం కాబోతున్న ‘సామ్ జామ్’ ప్రోగ్రాం ప్రోమో రిలీజ్ చేశారు. ఇందులో సమంత, అల్లు అర్జున్, అల్లు అరవింద్ ఫన్నీ సంభాషణ ప్రోగ్రాంపై ఆతృత పెంచేసింది.

నాతో ఎంజాయ్‌మెంట్ మామూలుగా ఉండదంటూ ఆహా వేదికపై ‘సామ్ జామ్’ ప్రోగ్రాం ప్రారంభించిన అక్కినేని సమంత అన్నట్లుగానే ఓ రేంజ్‌లో ఆకట్టుకుంటోంది. సెలబ్రిటీల సీక్రెట్స్ వారి చేతనే చెప్పిస్తూ ప్రోగ్రామ్‌ని విజయవంతంగా నడిపిస్తోంది. ముఖ్యంగా హోస్ట్ రూపంలో సమంత ముద్దు ముద్దు మాటలు బాగా అట్రాక్ట్ చేస్తుండటం ఈ షోకి మేజర్ ఎసెట్ అయింది. ఫస్ట్ ఎపిసోడ్ విజయ్ దేవరకొండతో మొదలుపెట్టి మొన్న చిరంజీవి వరకూ అందరితో సరదాగా మాట్లాడిన సామ్.. తాజాగా అల్లు అర్జున్, అల్లు అరవింద్‌లతో మజా చేసింది.

అయితే ఫిలిం సర్కిల్స్ నుండి అందుతున్న సమాచారం ప్రకారం ఈ సంక్రాంతికి సామ్ జామ్ ఎపిసోడ్ లో మరొక తెలుగు సూపర్ స్టార్ తో షో ప్లాన్ చేస్తుందట ఆహా టీమ్. ఆ సూపర్ స్టార్ ఎవరో కాదు టాలీవుడ్ అందగాడు మహేష్ బాబు. అంతే కాకుండా మహేష్ బాబుతో పాటు తన భార్య నమ్రత మరియు పిల్లలు కూడా ఈ ఎపిసోడ్ లో కనబడి సంక్రాంతికి ప్రేక్షకులకు మంచి ఎంజాయిమెంట్ ఇవ్వనున్నారని తెలుస్తుంది. ఈ వార్తతో మహేష్ బాబు అభిమానులు సంతోషంగా ఉన్నారు. కరోనా కారణంగా మహేష్ నటిస్తున్న సర్కారు వారి పాట షూటింగ్ పెండింగ్ లో పడింది. ఇప్పటివరకు మహేష్ ఏ ప్రోగ్రామ్ లో కనిపించలేదు. అంతే కాకుండా పెద్దగా అప్ డేట్లు కూడా లేవు. అందుకే ఈ ప్రోగ్రామ్ లో మహేష్ రాక కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published.