గజపతి కోటలో వారసత్వ పోరు

ఆనంద గజపతి రాజు మొదటి భార్య కుమార్తె సఞ్చిత గజపతి మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన విషయం తెల్సిందే. అంతే కాకుండా ఆమె తనకు అన్యాయం జరిగిందంటూ కోర్టు మెట్లు ఎక్కారు.

మాన్సాస్ ట్రస్ట్ బాధ్యతలు స్వీకరించడమే కాకుండా ఆస్తిలో వట కూడా ఉందని ఆవిడ చెప్తున్నా మాట. ఆనంద గజపతి పెద్ద కుమార్తెగా నాకు కూడా హక్కుందని కోర్టులో ఆవిడా కేస్ ఫైల్ చేసారు.

ఇదిలా ఉంటె అసలు సంచయిత కి హక్కు లేదని , ఆనంద గజపతి రాజు రాసిన విల్లు ప్రకారం మేము మాత్రమే కుటుంబ సభ్యులం అని, మొదటి భార్యకు విడాకులు ఇచ్చినపుడే అంతా సెటిల్ చేసారని, సంచయిత తల్లి ఉమా కూడా రెండో పెళ్లి చేసుకుంది కాబట్టి తనకు మా ఆస్తుల్లో వాటా లేదని ఆనంద గజపతి రెండో భార్య , కూతురు ఊర్మిళ చెప్తున్నా మాట.

ఇపుడు గజపతి కోటాలో అది కూడా ఇద్దరు వారసురాళ్ల మధ్య వారసత్వ పోరు మొదలైంది.

అయితే సంచయిత వర్గాలు చెప్తున్న మాట ఏంటంటే మొదటి భార్యకు విడాకులు ఇచ్చేసాము కాబట్టి రెండో పెళ్లి చేసుకుని, ఆ రెండో భార్యకు పుట్టిన పిల్లలకు మాత్రమే ఆస్తులు చెల్లుతాయని, మొదటి భార్యకు విడాకులు ఇచ్చినప్పుడే ఇచ్చేయాల్సింది ఇచ్చేసాం అంటే ఎలా? ఊహ కూడా తెలియని వయసులో తల్లి తండ్రులు విడిపోతారు, తండ్రి రెండో పెళ్లి చేసుకొని, తల్లి రెండో పెళ్లి చేసుకొని వెళ్ళిపోతే కూతురు / కొడుకుకి ఏం సంబంధం? విడాకులు ఇస్తే భార్య కు భర్తకు లీగల్ రైట్స్ తెగిపోతాయి కానీ తండ్రికి కూతురికి లీగల్ రైట్స్ ఎలా తెగిపోతాయి? అని అంటున్నారు.