సంజయ్‌ మంజ్రేకర్‌కు బీసీసీఐ షాక్

టీమిండియా మాజీ క్రికెటర్‌ సంజయ్‌ మంజ్రేకర్‌కు బీసీసీఐ షాకిచ్చింది. కామెంట్రీ ప్యానెల్‌లో సభ్యుడైన సంజయ్‌ పేరును ప్యానెల్‌ నుంచి తొలగించింది. అయితే ఇందుకు కారణాలు మాత్రం పేర్కొనలేదు. అతని పనితీరు నచ్చకే బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుందని భావిస్తున్నారు. సౌత్ ఆఫ్రికాతో ధర్మశాలలో జరగాల్సిన వన్డే మ్యాచ్‌కి ప్యానెల్‌ సభ్యులైన సునీల్‌ గవాస్కర్‌, ఎల్‌.శివరామకృష్ణన్‌, మురళీకార్తీక్‌లు హాజరైనా సంజయ్‌ మంజ్రేకర్‌ కనిపించకపోవడం ఈ వార్తకు బలం చేకూరుస్తోంది. ఆంగ్ల దినపత్రిక ఈ వ్యవహారంపై కథనం ప్రచురించడంతో విషయం వెలుగు చూసింది.

Read Previous

శ్రీ రెడ్డికి పరోక్షంగా వార్నింగ్ ఇచ్చిన పవన్

Read Next

ఉగ్రవాదుల కంటే తీవ్రంగా వైసీపీ నేతలు తయారైయ్యారు: బాబు

Leave a Reply

Your email address will not be published.