వాయిదా: సర్కారు వారు మరోసారి ఆగారు..!
Entertainment Timeline Tollywood

వాయిదా: సర్కారు వారు మరోసారి ఆగారు..!

2022 సంక్రాంతి రేసులో టాలీవుడ్ స్టార్ హీరోల సినిమాలు క్యూ కట్టాయి. దాదాపుగా స్టార్ హీరోల సినిమాలన్నీ సంక్రాంతి రేసులోనే వున్నాయి. రెండు వారాలు కూడా గ్యాప్ లేకుండానే ఆర్ఆర్ఆర్, భీమ్లా నాయక్, సర్కారు వారి పాట, రాధే శ్యామ్ సినిమాలు విడుదల తేదీలను కూడా ప్రకటించాయి. ఇక వెంకీ-వరుణ్ తేజ్ సినిమా ఎఫ్ 3 కూడా సంక్రాంతిపైనే కన్నేసింది. దీంతో సినిమా విడుదల తేదీలు మారుతాయా..? లేదా..? మారితే ఏ సినిమాలు వెనక్కి తగ్గుతాయనేది కొద్దిరోజుల్లోనే క్లారిటీ రానుంది.

అయితే, తాజా సమాచారం ప్రకారం సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న ‘సర్కారు వారి పాట’ సినిమా ఏప్రిల్ 28కి వాయిదా పడినట్లుగా ప్రచారం జరుగుతోంది. సంక్రాంతికి విడుదల కావాల్సిన సినిమాలు ఎక్కువే ఉండటంతో వేసవికి వాయిదా వేశారని తెలుస్తోంది. షూటింగ్ కూడా చాలా ప్రశాంతగానే నడిపిస్తున్నారని, సంక్రాంతికి సినిమా తీసుకువచ్చే ఆలోచన చిత్ర యూనిట్ కు లేదనే టాక్ వినిపిస్తోంది. మరి ముఖ్యంగా ఆర్ఆర్ఆర్ సినిమాకు సాఫ్ట్ రూట్ ఇవ్వాలనే ఉద్దేశ్యంతోనే మహేష్ ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా కూడా ప్రచారం జరుగుతోంది. అతి త్వరలోనే దీనిపై స్పష్టత రానుంది.