Breaking News :

త్రివిధ దళాల సిబ్బంది పదవీ విరమణ వయస్సు పొడగింపు

త్రివిధ దళాల సిబ్బంది పదవీ విరమణ వయస్సును పొడిగిస్తున్నట్లు డిఫెన్స్‌ స్టాఫ్‌ చీఫ్‌ జనరల్‌ బిపిన్‌రావత్‌ ప్రకటించారు. దీనిపై త్వరలోనే ఉత్తర్వులు జారీ చేస్తామని తెలిపారు. దీనితో 15 లక్షల మంది సిబ్బంది లాభపడతారని ఆయన వెల్లడించారు. 

పెరుగుతున్న పనిభారాన్ని దృష్టిలో ఉంచుకుని, ఖర్చులను తగ్గించడానికి ఈ నిర్ణయం తీసుకున్నారా అని ప్రశ్నించగా.. మానవ శక్తి ఖర్చుల గురించి ఆలోచిస్తున్నామని పేర్కొన్నారు. ఒక జవాను కేవలం 15 నుండి 17 ఏళ్లు మాత్రమే ఎందుకు సేవలందించాలి, 30 ఏళ్ల వరకు సేవచేస్తే తప్పేముంది అని సమాధాన మిచ్చారు. 

అద్భుతంగా శిక్షణ పొందిన మానవ వనరులను మనం కోల్పోతున్నామని తెలిపారు. పోరాట సమయంలో ముందుండి పోరాడేది యువకులే అయినప్పటికీ, వైద్య పరంగా ఉన్న ప్రత్యేక దళాలు 50 ఏళ్ల వరకు సేవలందిస్తే తప్పేముందని ప్రశ్నించారు. 

Read Previous

ఆరోగ్య సేతు : 10 కోట్ల మందిని చేరింది

Read Next

అలర్ట్: కెసిఆర్ హై లెవెల్ మీటింగ్ ఈరోజే