బ్రేకింగ్ : బిడెన్ కు రక్షణ పెంచుతున్న సీక్రెట్ సర్వీస్ ..
Timeline

బ్రేకింగ్ : బిడెన్ కు రక్షణ పెంచుతున్న సీక్రెట్ సర్వీస్ ..

రోజు రోజుకీ అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాల పై ఉత్కంఠ పెరుగుతుంది ప్రపంచ వ్యాప్తంగా. అయితే ఇప్పటికే వెలువడిన ఫలితాలను భట్టి చూస్తే ఖచ్చితంగా ట్రంప్ ఓడిపోవడం ఖాయం అన్నట్టుగా అమెరికా మీడియా వార్త కథనాలు ప్రచురిస్తున్నాయి. అంతే కాకుండా జో బిడెన్ గెలుపు మాత్రం అధికారికంగా ఫలితాల ద్వారా ప్రకటింపబడలేదు.

అయితే బిడెన్ గెలుపు తథ్యం అనే ప్రచారం పెరిగిపోవడం ఒక వైపు, ట్రంప్ ఎన్నికల విధానంలో తప్పులు జరిగాయని అభియోగాలు మోపి కోర్టులకి వెళ్లడం , ట్రంప్ కోసం అయన మద్దతు దారులు ధర్నాలు చేయడం జరుగుతుంది మరోవైపు. ఈ నేపథ్యంలో బిడెన్ కు రక్షణ పెంచే పనిలో పడ్డారు అమెరికా సీక్రెట్ సర్వీస్. ఈ వార్తను వాషింగ్టన్ పోస్ట్ రిపోర్ట్ చేసింది.

దీన్ని భట్టి చూస్తే సీక్రెట్ సర్వీస్ చెవిలో బిడెన్ అధ్యక్షుడు అన్న వార్త పడినట్టే అని అర్ధం అయిపోతుంది.