బ్రేకింగ్: భారత్ బయోటెక్ కరోనా వ్యాక్సిన్ అనుమతి రిజెక్ట్
Timeline

బ్రేకింగ్: భారత్ బయోటెక్ కరోనా వ్యాక్సిన్ అనుమతి రిజెక్ట్

ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్న కరోనా వ్యాక్సిన్ ఇలా వచ్చినట్టే వచ్చి రావట్లేదు. ఇప్పటికే పలు దేశాలు మాత్రం వ్యాక్సిన్ రిలీజ్ చేసి ప్రయోగాలు చేస్తున్నాయి రోగులపై. అయితే భారత్ లో కూడా కరోనా వ్యాక్సిన్ తయారు చేస్తున్న భారత్ బయోటెక్ మరియు సేరం ఇన్స్టిట్యూట్ నుండి వచ్చిన టీకా ప్రతిపదాలను తిరస్కరించబడ్డాయి. దానికి కారణం “భద్రత లోప” మరియు సమర్థతపై సరిపోని డేటా అని తెలుస్తుంది.

ఈ రోజు సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (సిడిస్కో) యొక్క సబ్జెక్ట్ ఎక్స్‌పర్ట్ కమిటీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

“ప్రభుత్వం అనేక సమావేశాలు నిర్వహించడం ప్రామాణిక పద్ధతి. ఈ ప్రక్రియ ఒకటి లేదా రెండు వారాల పాటు కొనసాగుతుందని భావిస్తున్నారు” అని సీరం ఇన్స్టిట్యూట్ వర్గాలు తెలిపాయి.ప్రపంచంలోనే అతిపెద్ద టీకా తయారీ సంస్థ పూణేకు చెందిన సీరం ఇన్స్టిట్యూట్, కోవిషీల్డ్ అనే ఆక్స్‌ఫర్డ్ వ్యాక్సిన్‌కు డిసెంబర్ 6 న అనుమతి కోరింది.

ఫార్మా దిగ్గజం ఫైజర్ యుకె మరియు బహ్రెయిన్‌లో అనుమతులు పొందిన తరువాత భారత అనుమతి కోరింది.

సోమవారం, హైదరాబాద్‌కు చెందిన భారత్ బయోటెక్ దేశీయంగా అభివృద్ధి చేసిన కోవిడ్ -19 వ్యాక్సిన్ కోవాక్సిన్ కోసం అత్యవసర వినియోగ అధికారం కోసం డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డిసిజిఐ) కు దరఖాస్తు చేసిన మూడవ వ్యాక్సిన్ తయారీదారుగా అవతరించింది.

డిసెంబర్ 4 న జరిగిన అఖిలపక్ష సమావేశంలో ప్రధాని నరేంద్ర మోడీ కొన్ని వారాల్లో కోవిడ్ వ్యాక్సిన్ సిద్ధంగా ఉండవచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు.

మొన్న హైదరాబాద్ ఎన్నికల ముందు దేశ ప్రధాని భారత్ బయోటెక్ తో పాటు పలు వ్యాక్సిన్ తయారీ కంపెనీలు సందర్శించడంతో అందరూ ఇక వ్యాక్సిన్ వచ్చేస్తుందని ఆశ పడ్డారు కానీ ఫలితం లేదని తేలిపోయింది ప్రస్తుతానికి.

https://twitter.com/Suparna_Singh/status/1336640047848640515?s=20

Update : అప్ డేట్ : 7:22 PM

Ee వార్తల్లో నిజం లేదని మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అధికారిక ప్రకటన చేసింది. మీడియాలో వచ్చిన వార్తలు అవాస్తవమని తెలిపింది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *