చిదంబరంకు సుప్రీంకోర్టులో ఎదురు దెబ్బ
Timeline

చిదంబరంకు సుప్రీంకోర్టులో ఎదురు దెబ్బ

కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి పి. చిదంబరంకు సుప్రీంకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. చిదంబరంకు ముందస్తు బెయిల్‌ ఇవ్వడానికి సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఆర్థిక నేరాల్లో మాత్రమే అత్యంత అరుదుగా ముందస్తు బెయిల్‌ను ఉపయోగించుకోవాలని, వాస్తవాలను, పరిస్థితులను పరిశీలించిన మీదట ఈ కేసు ముందస్తు బెయిల్‌ పరిధిలోకి రాదని సుప్రీంకోర్టు పేర్కొంది.

దీనితో ఇప్పటికే 15 రోజులపాటు సిబిఐ కస్టడీలో గడిపిన చిదంబరంను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఇ.డి.) అరెస్టు చేసే అవకాశం ఏర్పడింది. దర్యాప్తు చేస్తున్న సంస్థలు తమ దర్యాప్తును కొనసాగించడానికి వీలుగా స్వేచ్ఛనివ్వాలని సుప్రీంకోర్టు పేర్కొంది.

Leave a Reply

Your email address will not be published.