గ్యాస్ ట్యాంకర్ తో బస్సు ఢీ – ఏడుగురు మరణించారు , 25 మంది గాయపడ్డారు
Timeline

గ్యాస్ ట్యాంకర్ తో బస్సు ఢీ – ఏడుగురు మరణించారు , 25 మంది గాయపడ్డారు

సంభల్: పొగమంచు కారణంగా ఉత్తరప్రదేశ్ రోడ్‌వేస్ బస్సు, గ్యాస్ ట్యాంకర్‌తో ఢీ కొట్టడంతో ఏడుగురు మృతి చెందగా, మరో 25 మంది గాయపడ్డారు. ధనారీ పోలీస్ స్టేషన్ ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది.

“అలీఘర్ డిపోకు చెందిన యుపి రోడ్‌వేస్ బస్సు బుధవారం ఆగ్రా-మొరాదాబాద్ రహదారిపై గ్యాస్ ట్యాంకర్‌తో ఢీ కొట్టింది, ఇందులో ఏడుగురు మరణించారు, మరో 25 మంది గాయపడ్డారు. మరణాల సంఖ్య పెరగవచ్చు” అని పోలీసు సూపరింటెండెంట్ చక్రేష్ మిశ్రా అన్నారు.క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రులలో చేర్పించారు.

Leave a Reply

Your email address will not be published.