తెలంగాణలో 1,000 మంది పురుషులకు 924 మంది మహిళలు మాత్రమే
Timeline

తెలంగాణలో 1,000 మంది పురుషులకు 924 మంది మహిళలు మాత్రమే

సెన్సస్ ఇండియా ఇటీవల విడుదల చేసిన ‘వైటల్ స్టాటిస్టిక్స్ ఆన్ ఇండియా వార్షిక నివేదిక’ – 2018 ప్రకారం, తెలంగాణ అతి తక్కువ లింగ నిష్పత్తి కలిగిన రాష్ట్రాల్లో ఒకటి. ఆటే ప్రతీ 1,000 మంది పురుషులకు 924 మంది మహిళలు మాత్రమే ఉన్నారు. 

23 రాష్ట్రాలకు లింగ నిష్పత్తి డేటా విడుదల చేయబడింది, మరియు 16 రాష్ట్రాలు తెలంగాణ కంటే మెరుగైన సెక్స్ రేషియో కలిగి ఉన్నాయి. అన్ని రాష్ట్రాలలో అరుణాచల్ ప్రదేశ్ ఉత్తమ లింగ నిష్పత్తిని కలిగి ఉంది. అక్కడ 1,000 మంది పురుషులకు 1,084 మంది మహిళలు ఉన్నారు. 

దక్షిణ భారత రాష్ట్రాలలో, కేరళలో ఉత్తమ లింగ నిష్పత్తి 963 గా ఉంది. తెలంగాణ యొక్క లింగ నిష్పత్తి 2017 నుండి స్వల్పంగా మెరుగుపడింది, 2017 లో 1,000 మంది పురుషులకు 915 మంది మహిళలు ఉన్నారు.