బంజారాహిల్స్‌లోని కోట్ల రూపాయాల విలువైన భూ వివాదం కేసులో చిక్కుకుని.. ఆదాయానికి మించి ఆస్తుల కేసులో అరెస్ట్ అయిన షేక్‌పేట్ తహశీల్దార్ సుజాత భర్త ఆత్మహత్యకు పాల్పడ్డారు.. గాంధీనగర్‌లో భవనంపైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నారు సుజాత భర్త అజయ్.
చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని గాంధీనగర్‌లోని తన చెల్లెలు ఇంటి దగ్గర ఉదయం 7 గంటల సమయంలో ఐదు అంతస్తుల భవనం పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.
ఇటీవలే ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో సుజాతను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేయగా పలు సెక్షన్ల కింద ఆమెపై కేసులు నమోదు చేశారు అయితే, ఇదే కేసులో సుజాత భర్త అజయ్‌ను సైతం విచారించారు ఏసీబీ అధికారులు.
ఓవైపు భార్య సుజాత అరెస్ట్ కావడం మరోవైపు పరువుపోయిందనే ఆయన ఆత్మహత్యకు పాల్పడినట్టు తెలుస్తోంది. కాగా, ఏసీబీ అధికారుల వేధింపుల వల్లే అజయ్‌కుమార్ ఆత్మహత్యకు పాల్పడ్డారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.