బాల సుబ్రహ్మణ్యం కరోనా బారిన పడ్డారు. ఆగస్టు 5 నుంచి చెన్నై ఎంజీఎంలో ఆయన చికిత్స పొందుతున్నారు. అప్పటి నుండి ఆసుపత్రిలోనే ఉన్నారు. గత వారం అయన ఆరోగ్యం బాగానే ఉందని సమాచారం వచ్చింది.

ఇంతలోనే ఇలా మళ్ళీ ఎస్పీ బాలు ఆరోగ్యం అత్యంత విషమంగా ఉన్నట్లు ఎంజీఎం వైద్యులు 24 సాయంత్రం హెల్త్ బులిటెన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే అర్ధరాత్రి 12 గంటలకు మరో హెల్త్ బులిటెన్‌ను విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. బాలుకు ఎక్మోతో పాటు ఇతర ప్రాణాధార చికిత్సనందించారు. ఎస్పీబీ ఆరోగ్య పరిస్థితిని వైద్య నిపుణుల బృందం ఎప్పటికప్పుడు సమీక్షించారు. అయినా ఎటువంటి ప్రయోజనం పోయింది.

ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం(74) శుక్రవారం మధ్యాహ్నం కన్నుమూశారు.