టాలీవుడ్ లో ప్రముఖ సింగర్ గా ఉన్న సునీత ఈ రోజు ఉదయం నిశ్చితార్థం చేసుకున్నారు. కొద్ది రోజుల నుంచి ఆమె రెండో వివాహం చేసుకోనున్నట్లు సోషల్ మీడియాలో విపరీతమైన ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. ఆ వార్తను నిజం చేస్తూ ఆమె ఈ రోజు ఉదయమే వివాహ నిశ్చితార్థం చేసుకున్నట్లు సమాచారం. ముందు నుంచీ ప్రచారం జరిగినట్లుగానే ఆమె మ్యాంగో మీడియా అధినేత రామ్ తో నిశ్చితార్ధం చేసుకున్నారు. కాగా చిన్న వయసులోనే సింగర్ గా టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన సునీత చిన్న వయసులోనే పెళ్లి కూడా చేసుకున్నారు. ఆమెకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే ఆమెకు భర్తకు పడకపోవడంతో ఆమె భర్త నుండి విడాకులు తీసుకున్నారు. 

ఇక ఆమె వివాహం చేసుకోబోతున్న ఆయనకు కూడా ఇది రెండో వివాహం అని తెలుస్తోంది. కరోనా కారణంగా కేవలం రెండు కుటుంబాల పెద్దలు మాత్రమే ఈ ఉదయం శుభకార్యానికి హాజరయ్యారని సమాచారం. అయితే ఇన్ని రోజులు బట్టి పెళ్లి గురించి ప్రచారం జరుగుతున్నా సునీత స్పందించకపోవడంతో ఈ వార్తలు నిజమే అని చాలా మంది భావించారు కానీ ఆమె వైపు నుంచి ఈ నిశ్చితార్థానికి సంబంధించి కానీ పెళ్లికి సంబంధించి ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. చివరికి ఫోటోలు బయటకు రావడంతో ఆమె అధికారికంగా ద్రువీకరించాల్సి ఉంది.

Image
Image
 Singer Sunitha Engagement : ప్రముఖ సింగర్‌ సునీత రెండో పెళ్లిపై వస్తోన్న‌ రూమర్స్‌ను నిజం అయ్యాయి. గత కొన్ని రోజులుగా ఆమె రెండో పెళ్లిపై వదంతులు వ్యాపిస్తున్న విషయం తెలిసిందే. ఈ వార్తలకు ఫుల్‌స్టాప్‌ పెడుతూ క్లారిటీ వచ్చింది. డిజిట‌ల్ రంగంలో కీల‌క పాత్ర పోషిస్తున్న బిజినెస్ మెన్‌ రామ్‌ వీరపనేనితో సోమవారం ఉదయం సునీత నిశ్చితార్థం జరిగింది. గతంలో అంటే 19 ఏళ్ల వయసులోనే సునీతకు పెళ్లయ్యింది. ఇద్దరు పిల్లలు కూడా.. అయితే భర్త తీరుతో విసిగిపోయి విడాకులు తీసుకున్న సునీత.. తాజాగా మరోసారి పెళ్లి చేసుకుంటోంది.
 Singer Sunitha Engagement : సింగర్ సునీత ఎంగేజ్‌మెంట్

Leave a Reply

Your email address will not be published.