దారుణం .. తల్లి చనిపోయిందని కొడుకు ఆత్మహత్య
Timeline

దారుణం .. తల్లి చనిపోయిందని కొడుకు ఆత్మహత్య

ఈ ప్రపంచంలో ఎవరూ తీర్చలేని లోటు, విలువ కట్టలేనిది ఏదైనా ఉందంటే అది అమ్మ ప్రేమ ఒక్కటే. తల్లి తండ్రుల ప్రేమ విలువ తెలియక చాల మంది క్రూరంగా ప్రవర్తిస్తున్న తీరు రోజు వార్తల్లో చూస్తున్నాం. కానీ ఈ అబ్బాయి తన తల్లి చనిపోయిందని తెలిసి, ఇక అమ్మ లేదనే నిజాన్ని దిగమింగుకోలేకపోయాడు. అమ్మ లేని ఈ లోకంలో తనకు కూడా పని లేదనుకున్నాడు. తల్లి దగ్గరికే తాను వెళ్లిపోవాలనుకొని నిర్ణయం తీసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.

{ ఆత్మహత్య చేసుకోవడం చట్టరిత్యా నేరం – అంతే కాకుండా ఆత్మహత్య చేసుకోవాలనుకోవడం తప్పు ఆలోచన – మీకు ఏ బాదున్నా సరే మీ చుట్టూ ఉన్నవాళ్ళతో అది షేర్ చేసుకోండి – మీ ఆలోచనలు మీ జీవితాన్నే కాదు మిమ్మల్ని ఇష్టపడేవారు జీవితాల మీద కూడా ప్రభావం చూపుతాయి }

తెలుగు సర్కిల్స్

మద్దూరు మండలంలోని నాగిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన వంచర్ల సునీత ఆనారోగ్యంతో నాలుగు నెలల కిందట మరణించింది. అప్పట్నుంచి ఆమె రెండో కుమారుడు వంచర్ల వినోద్‌కుమార్‌(20) తల్లిని తలచుకుంటూ ఎవరితో కలిసేవాడు కాదు. ఈ నేపథ్యంలో మనస్తాపంతో బుధవారం రాత్రి ఇంట్లో పురుగుమందు తాగాడు. గమనించిన తండ్రి హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రికి తరలించాడు. చికిత్స పొందుతూ గురువారం మరణించాడు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు.