ప్రస్తుతం ‘సామ్ జామ్’ టాక్ షోతో తీరిక లేకుండా గడుపుతోంది అక్కినేని సమంత. తెలుగులో ‘జాను’ తర్వాత ఆమె మరే సినిమాలోనూ నటించలేదు. తమిళంలో మాత్రం రెండు సినిమాలు అంగీకరించింది. అవి త్వరలోనే పట్టాలెక్కనున్నాయి. తాజాగా, హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి ఇంటికి తిరిగొస్తున్న సందర్భంగా సమంత పిక్స్ నెటింట్ల వైరల్ అయ్యాయి.
ఏ పాత్ర వేసినా ప్రాణం పోసే నటి సమంత… పెళ్లి తరువాత విభిన్న కథా చిత్రాల్లో నటిస్తోంది.
సమంత సినిమాలతో బిజీగా ఉంటూనే శరీరాన్ని ఫిట్‌గా ఉంచుకునేందుకు జిమ్, యోగా వంటివి నిత్యం చేస్తుంటారు. అప్పుడప్పుడు తాను వేసిన యోగాసనాలను సోషల్‌మీడియాలో పోస్టు చేసి అభిమానులతో పంచుకుంటుంటారు.
వెకేషన్ ట్రిప్స్ అంటే తెగ ఇష్టపడే ఈ బ్యూటీ ఎప్పుడు ఏ టూర్ వేసినా తన అందాలతో సోషల్ మీడియాను షేక్ చేయడం కామన్ అయిపొయింది.
ఓ వైపు సినిమాలు చేస్తూనే మరో వైపు వెబ్ సిరీస్‌లు చేస్తున్న సమంత.. వ్యాపారవేత్తగా కూడా సత్తా చాటుతోంది.

ఖాళీ సమయాల్లో భర్త నాగ చైతన్యతో కలిసి చాలా టూర్స్ ప్లాన్స్ చేస్తూ ఉంటది సమంత.. పెళ్లికి ముందు కూడా మీడియా కంటా పడకుండా చాలానే తిరిగారు.
