spot_imgspot_img

ఎన్టీఆర్ కారు.. జగిత్యాల బయలుదేరిన శ్రీముఖి

యాంక‌ర్ శ్రీముఖి గురించి ప్రత్యేకంగా చేప్పాల్సిన పనిలేదు. తన అందచందాలతో చురుకైన మాటలతో యాంకరింగ్ చేస్తూ తెలుగువారిని గత కొన్నేళ్లుగా అలరిస్తూనే ఉంది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం ఈ బ్యూటీకి సినిమా ఆఫర్లు కూడా బాగానే ఉన్నాయి.

ఇదిలావుంటే, రీసెంట్ గా కమెడియన్ ముక్కు అవినాష్ పెళ్లికి శ్రీముఖి హాజరైన విషయం తెలిసిందే. బిగ్ బిస్ షో నుంచి వీరి స్నేహం స్ట్రాంగ్ కావడంతో, వీరిద్దరూ కలిసి యూట్యూబ్ వీడియోస్ కూడా చేశారు. ఇక అవినాష్ రిసెప్షన్‌కు కూడా శ్రీముఖి అండ్ గ్యాంగ్ వెళ్లి నూతన దంపతులకు విషెస్ తెలిపారు. అయితే ఈ కార్యక్రమానికి వెళ్లిన ప్రయాణాన్ని శ్రీముఖి తన యూట్యూబ్ ఛానల్ లో షేర్ చేసింది.

ఇక జూబ్లీహిల్స్ నుంచి బయలు దేరిన శ్రీముఖి టీఆర్ఎస్ పార్టీ ప్లీనరీ సమావేశం కోసం ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను చూసి ఆశ్చర్యపోయింది. జై కేసీఆర్.. జైజై కేటీఆర్ అంటూ నినదించింది. ఆ వెంటనే ఎన్టీఆర్ కారు కనిపించడంతో శ్రీముఖి తన ఆనందాన్ని వ్యక్తపరిచింది. రీసెంట్ గా ‘ఎన్టీఆర్ గారిని కలుద్దామనుకున్నా కానీ, ఆయన భార్య ప్రణీత కలిసింది’ అని శ్రీముఖి తెలిపింది. ఇక అలా.. అలా శ్రీముఖి అల్లరితో జగిత్యాల ప్రయాణం ముగిసింది.

Related Articles

Get in Touch

18,128FansLike
3,030FollowersFollow
0SubscribersSubscribe

Latest Posts