సింగపూర్‌ మ్యూజియంలో అతిలోక సుందరి మైనపు విగ్రహం

సింగపూర్‌లోని మేడమ్ టుస్సాడ్స్‌ మ్యూజియంలో అతిలోక సుందరి శ్రీదేవి మైనపు విగ్రహాన్ని సెప్టెంబర్‌ 4 న ఆవిష్కరించనున్నట్టు టుస్సాడ్స్‌ సంస్థ తమ ట్విట్టర్‌ ద్వారా తెలిపింది. ఇటీవల శ్రీదేవి జయంతిని పురస్కరించుకొని.. ప్రముఖ పబ్లిషర్స్‌ పెంగ్విన్‌ రాండమ్‌ హౌస్‌ ఇండియా శ్రీదేవి జీవిత చరిత్రను పుస్తక రూపంలో రిలీజ్‌ చేస్తున్నట్టుగా ప్రకటించారు.

ఇందుకు శ్రీదేవి భర్త బోనికపూర్‌ అనుమతి కూడా తీసుకున్నట్టు తెలిపారు. ‘ శ్రీదేవి గర్ల్‌ ఉమెన్‌ సూపర్‌ స్టార్‌ ‘ పేరుతో రూపొందుతున్న ఈ పుస్తకాన్ని ప్రముఖ రచయిత సత్యార్థ నాయక్‌ రాస్తున్నారు. ఈ పుస్తకం అతి త్వరలోనే రానుంది.