శ్రీదేవి జీవితచరిత్ర పుస్తకం విడుదల

8

అతిలోక సుందరిగా కొన్ని వందల చిత్రాల్లో నటించి ఎందరో అభిమానుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న నటి శ్రీదేవి. వెండితెరపై ఎంతో మంది హీరోయిన్స్ వచ్చినా.. అతిలోకసుందరి అంటే అందరి మదిలో మెదిలే రూపం శ్రీదేవిదే. ఆమె మన నుంచి దూరమై దాదాపు రెండేళ్లు కావొస్తోంది. అంతేకాదు భారతీయ చిత్ర పరిశ్రమలో ఓ నటిగా చెరగని ముద్ర వేసింది శ్రీదేవి. తాజాగా ఆమె జీవితంపై రాసిన పుస్తకాన్ని ఢిల్లీలో విడుదల చేసారు. ప్రముఖ రచయత సత్యార్ధ్ నాయక్.. ‘శ్రీదేవి: ది ఎటర్నల్ స్క్రీన్ గాడెస్’ పేరుతో ఈ పుస్తకాన్ని రాసారు.