ఇంగ్లీష్ లో RRR: హాలీవుడ్ స్టూడియోస్ తో రాజమౌళి ఒప్పందం

120

దర్శకధీరుడు, బాహుబలి మేకర్ ఎస్ఎస్ రాజమౌళి తన తదుపరి సినిమా RRR కోసం ఇద్దరు టాలీవుడ్ టాప్ హీరోలను ఎంచుకున్నారు. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు హీరోలుగా రాజమౌళి సగం సినిమా షూటింగ్ కూడా కంప్లీట్ చేసేసాడు.

ఇక బాహుబలి రెండు చిత్రాల తరువాత రాజమౌళి చేయబోయే సినిమాపై జాతీయ స్థాయిలో ఆసక్తి పెరిగిపోయింది. ఈ మధ్యనే ఈ సినిమాలో నటించబోయే హీరోయిన్స్ మరియు ఇతర ఆర్టిస్టుల గురించి కూడా వివరాలు తెలియజేసారు.

అయితే ఇపుడు మరో వార్త చక్కర్లు కొడుతుంది, ఈ సినిమా కోసం హాలీవుడ్ ఆర్టిస్టులనే కాకుండా హాలీవుడ్ స్టూడియోస్ ని కూడా రాజమౌళి సంప్రదిస్తున్నారట.

ఇప్పటికే ఈ సినిమా గురించి చాల వార్తలు ప్రచారంలో ఉన్నాయి , 300 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమా తీస్తున్నారని, ఇండియా లోని అన్ని బాషలలో సినిమా రిలీస్ ఉంటుందట.

అయితే RRR సినిమాని కూడా ఇంగ్లీష్ లో డబ్ చేసి హాలీవుడ్ స్టూడియోస్ తో ఒప్పందం చేసుకొని ఒక హాలీవుడ్ సినిమా రేంజులో రిలీజ్ చేయాలనీ సిద్దమవుతున్నారట.