Breaking News :

ఏప్రిల్ 14- ఆ తరువాత స్టెప్ బై స్టెప్ లాక్ డౌన్ ఎత్తివేత

దేశంలో కరోనా వైరస్ ను కట్టడి చేసేందుకు ప్రభుత్వం మార్చి 24 వ తేదీ నుంచి దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ ను ఏర్పాటు చేసింది. లాక్ డౌన్ ఇప్పటి వరకు విజయవంతంగా కొనసాగుతున్నది. లాక్ డౌన్ కారణంగా చాలా వరకు కరోనా వైరస్ ను అడ్డుకోగలిటినట్టు ప్రధాని తెలిపారు.  అదే విధంగా ఏప్రిల్ 14 వ తేదీ నుంచి దేశంలో లాక్ డౌన్ ను దశలవారీగా ఎత్తివేసేందుకు కేంద్రం సుముఖత ను వ్యక్తం చేసింది. 

లాక్ డౌన్ ఎత్తివేసిన తరువాత జనం ఒక్కసారిగా రోడ్డు మీదకు రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రధాని మోడీ ముఖ్యమంత్రులకు తెలిపారు. ఈరోజు మోడీ దేశంలోని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. లాక్ డౌన్ తరువాత దేశంలో ఎదురయ్యే పరిస్థితుల గురించి చర్చించారు. ఎలాంటి వ్యూహాలు అనుసరించాలి అనే వాటి గురించి రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మాట్లాడారు. రోడ్ మ్యాప్ తయారు చేయాల్సిందిగా ముఖ్యమంత్రులకు ప్రధాని సూచించారు.

Read Previous

వైజాగ్ ప్రజలపై యాంకర్ రష్మీ ఆగ్రహం

Read Next

బ్రేకింగ్: వైరస్ వ్యాప్తిని చైనా దాచిపెట్టింది: అమెరికా ఇంటలిజెన్స్ రిపోర్ట్