@peacefulllsoul : అందుకే రావణ దహనం

5

రావణుడు గొప్ప తపస్వి చాలా తెలివి గలవాడు ఎంత విజ్ఞానం ఉందంటే వేదలకి లయ ఇచ్చాడు ఇపుడు చదువుతున్న వేదలన్నిటికి శృతి ఇచ్చినవాడు ఆయనే ఏక కాలంలో పది మంది చేసే ఆలోచనలు అతనొక్కడే చేయగలడు..అందుకే దశకంఠుడు అని అతనికి పేరు.. తన శిరస్సు తెంచి, శివునికి అర్పించి ప్రసన్నం చేసుకున్నాడు

అతని తండ్రి ఒక ఋషి, తల్లికి ఎంతకాలనికి పెళ్లి చేయలేదు(ఆమె తండ్రి) ఇక చేసేది లేక ఈ ఋషి ఆశ్రమానికి వచ్చి శరణు అని అంది అతను “ఎం కావాలో అడగమ్మా” అంటే నన్ను పెళ్లి చేసుకో అనింది,నీకు సాయం చేయదలిస్తే ఇలా రాక్షస కోరిక కొరావు కాబట్టి నీకు పుట్టేవాళ్లకి రాక్షసబుద్ది వస్తుంది అని చెప్తాడు

మాటకి కట్టుబడి పెళ్లి చేసుకుంటాడు.. తర్వాత వారికి పుట్టిన సంతానం రావణుడు, కుంభకర్ణుడు, విభిషణుడు, శూర్పాణఖ

2. తపస్సు చేసి వరాలు పొందిన రావణునికి విపరీతమయిన గర్వం వచ్చి నన్ను ఎదురించేవాళ్లు ఎవరు? అని శివుణ్ణి కైలాసాన్ని ఎత్తబోతే శివుడు చూపుడు వేలుతో అదిమినందుకు చేతులు నలుగుతాయి.అంత గర్వం ఉంది రావణునికి

3. లంక నగరం కూడా అతనిది కాదు అతని సవతి తమ్ముడు కుబేరునిది ఇది నాది అని బలంవంతంగా లాక్కొడానికి దూతలని మాటిమాటికీ పంపిస్తే కుబేరుడు తండ్రిని అడుగుతాడు ఇలా చేస్తున్నాడు రావణుడు అంటే, నన్ను కూడా చాలా ఇబ్బంది పెడుతున్నాడు నాయన..!అతనికి ఇచ్చేసి వెళ్ళిపో అంటాడు. కుబేరుడు లంక నగరాన్ని రావణుడికి ఇచ్చేసి వెళ్తాడు.. అలా దౌర్జన్యం గా స్వర్ణ మయమయిన లంకన్ని లాక్కున్నాడు ఇక్కడ రాముడు కేవలం తన తండ్రి సవతి తల్లికి ఇచ్చిన మాట కోసం రాజ్యాన్ని తమ్ముడికి వదిలేసి 14 సంవత్సరాలు అరణ్యవాసానికి వెళ్ళాడు అది తేడా

4. రావణుడికి కోరికలు ఎక్కువ అసలే గర్వం ఉంది. పైగా రాజు అయ్యాడు, పొందిన వరాలు ఉన్నాయి నన్ను ఆపేది ఎవడు అనే లాగా ఉండేది వ్యవహారం పెళ్లి అయిన వాళ్ళు, కానివాల్లు, పిల్ల తల్లుల్లు, ఋషి పత్నులు అనే బేధం లేకుండా నచ్చిన ప్రతి ఒక్కరినీ చేర బట్టాడు

5. అది అక్కడితో ఆగలేదు బ్రహ్మ కుమార్తె అయిన వేదవతి ని కూడ చెరబట్టినందుకు, తనని తానుఅగ్నికి ఆహుతి చేసుకుంది.

6. ఒకరోజు స్వర్గానికి వెళ్తూ రంభనీ చూసి మోహించి వెంటపడాడ్డ ఆమెకి అప్పడికే కుబేరుని కొడుకుతో విహాహం నిశ్చయం అవుతుంది నేను స్వర్గంలో నాట్యం చేసినప్పటికీ నాకు కొన్ని నియమాలు ఉంటాయి, నేను మీ సోదరుని కొడుకుతో విహహం నిశ్చయం అయ్యింది మీకు కోడలి వరస అన్న వదల్లేదు

7. ఇది తెలిసి కుబేరుడు తన పద్దతి మర్చుకొమ్మని దూత నీ పంపితే, దుతని ముక్కలుముక్కలు చేసి చంపేస్తాడు (దుతనీ చంపడం రాజధర్మం లో నిషిద్దం) హనుమంతుడు దూత గా వచ్చినపుడు చంపాలనుకుంటాడు కానీ విభీషణుడు అడ్డు పడి ఆపుతాడు

8. పుంజాస్తల అనే అప్సరస బ్రహ్మదేవుని కలవడానికి వెళ్తుంటే మార్గమధ్యంలో అడ్డుపడి తనని కూడా పాడుచేస్తాడు అప్పుడు బ్రహ్మదేవునికి కోపం వచ్చి ఇష్టం లేకుండా ఎవరి ధనాన్ని కానీ, స్త్రీనీ కానీ తాకితే తల వెయ్యి వక్కలవుతుంది అని శాపం పెడతాడు.. అపుడు… అప్పటి నుండి అడ్డు అదుపు లేకుండా సాగిన ఈ రాక్షస చర్య లన్నిటిని కాస్త తగ్గిస్తాడు

9. ముక్కు చెవులు కోసుకొని వచ్చిన శూర్పణఖ అన్న సంగతి తెలిసి, తనకి జరిగిన అవమానాన్ని పక్కన పెట్టి, ముందు సీత గురుంచి వర్ణిస్తుంది, లోకంలో అలాంటి అందగత్తె లేదు లాంటివి చెప్పి చివరకి తనకి జరిగింది చెప్తుంది ఎవరినైనా ఎదురించే రావణుడు ముందుగా తన సభలో రామలక్ష్మణుల దైర్య సాహసాలు విన్నాడు కాబట్టి నేరుగా వెళ్లకుండా మారీచుని తో కల్సి పన్నాగం వేసి సీత నీ ఎత్తుకు పోతాడు.. ఆ తర్వాత సీత నీ చాలా మెప్పియా డానికి ప్రయత్నిస్తాడు..వాళ్ళు (రామలక్ష్మణులు) చనిపోయినట్టు చూపిస్తాడు, రాక్షస స్త్రీలా చేత చిత్రహింసలు పెట్టిస్తాడు, భయపెట్టిస్తాడు ముట్టుకుకొకపోవడనికి కారణం అతనికి ఉన్న శాపం..సీత దేవి విషయంలో కూడ ప్రతి ఒక్కరూ వద్దని వారిస్తారు.. కుంభకర్ణుడు కూడ నీకోసం యుద్దం చేస్తాను గాని సీత దేవి నీ చేర బట్టటం లంక కి ముప్పు అని చెప్తాడు.. ఆమెని రామునికి అప్పజెప్పూ అంటాడు విభీషణుడు ఎంత చెప్పినా వినకపోయేసరికి రాముడి పక్షం వెళ్ళిపోతాడు

10. అతను చనిపోయాక దహన సంస్కారాలు చేయడానికి విభీషణుడు ముందుకు రాడు.. అప్పుడు రాముడు చనిపోయిన వారితో శత్రుత్వం ఉండదు నువు చేయకపోతే నేను చేస్తా అంటే అపుడు విభీషణుడు చేస్తాడు..

అతను చనిపోయాక మండోదరి కూడా ఎంతమంది పతివ్రత స్త్రీలని భాదపెట్టావు వాళ్ల కన్నీళ్ళే నికు శాపం అయ్యి, నీ ప్రాణాలు తీశాయి అని కట్టుకున్న భార్య ఏడ్చినందంటే రావణుడు ఎలంటివాడో అర్థం చేసుకోవచ్చు.

పరస్త్రీ వ్యామోహం, అధికార మధం, గర్వం హెచ్చు మీరితే అతను ఎంత జ్ఞాని అయిన, తెలివి ఉన్న, రావణుడి లాగే పతనం అవడం ఖాయం.. అందుకే రావణ దహనం..

Originally posted Here : https://twitter.com/peacefulllsoul/status/1181650882246537216