Breaking News :

NIT ఆంధ్ర ప్రదేశ్: పరీక్షలు క్యాన్సల్ చేయండి: విద్యార్థులు, తల్లితండ్రులు డిమాండ్

cancel nit andhra pradesh exams

కరోనా కార‌ణంగా అక‌డ‌మిక్ ఇయ‌ర్ నష్టపోకుండా ఉండేందుకు దేశమంతా విద్యాసంస్థలు పరీక్షలు రద్దు చేస్తున్నాయి. ఇక చివరి సంవత్సరంలో ఉన్న గ్రాడ్యుయేట్ విద్యార్థులకు ఆన్‌లైన్ ఎగ్జామ్స్ నిర్వహిస్తున్నాయి. లాక్‌డౌన్‌తో ఇళ్ల వద్దనున్న స్టూడెంట్స్ అక్కడి నుంచే ఎగ్జామ్స్ రాసేందుకు ఏర్పాట్లు చేస్తున్నాయి. పరీక్షల నిర్వహణలో ఆల‌స్యం జరిగితే ప్లేస్మెంట్స్ పొందిన‌వారు.. ఉన్నత చ‌దువుల‌కు వెళ్లాల్సినవారికి ఇబ్బందులు ఎదురవుతాయి. ఈ నేపథ్యంలో ఆన్‌లైన్ ఎగ్జామ్స్ కు తాడేపల్లిగూడెం నిట్ స్పెష‌ల్ సాఫ్ట్‌వేర్‌ను రూపొందించాయి.

తాడేపల్లిగూడెం నిట్..ఫైన‌ల్ ఇయ‌ర్ స్టూడెంట్స్ కు జూన్‌ 1 నుంచి ఆన్‌లైన్ ఎగ్జామ్స్ నిర్వహించారు. కాలేజీల్లో నిర్వహించిన మిడ్‌, మైనర్ ఎగ్జామ్స్ కు 75% వెయిటేజ్‌ ఇస్తారు. మిగతా 25% మార్కులకు మాత్రమే ఇప్పుడు ఎగ్జామ్ పెడ‌తారు. దీనిలో జంబ్లింగ్‌ విధానంలో బహుళైచ్ఛిక ప్రశ్నలు ఇస్తారు. స్పెష‌ల్ సాఫ్ట్‌వేర్‌తో విద్యార్థి తన కంప్యూటర్‌, ల్యాప్‌టాప్‌, మొబైల్‌ఫోన్‌లో కెమెరా ఆన్‌ చేస్తేనే క్వ‌చ్చ‌న్ పేప‌ర్ డౌన్‌లోడ్‌ అవుతుంది. ఈ కెమెరా స్టూడెంట్ ను పరిశీలిస్తూ ఉంటుంది. రెండు, మూడో సంవత్సరం స్టూడెంట్స్ కు మాత్రం ఆఫ్‌లైన్‌లోనే పరీక్షలు.

అయితే ఇప్పటికే ఆన్లైన్ పరీక్షలు రాసిన 4వ సంవత్సరం విద్యార్థులు ఇంటర్నెట్ ఇబ్బందులు ఎదుర్కొని పరీక్షలు సరిగ్గా రాయలేకపోయాం అని ఆవేదన వ్యక్తం చేసారు. ఒక్కో స్టూడెంట్ ఒక్కో ఊరి నుండి వచ్చిన వాడే. సగం విద్యార్థులు పల్లెటూర్ల నుండి వచ్చినవారే , మాకు మొబైల్ సిగ్నలే సరిగా రాదు ఇక ఇంటర్నెట్ వినియోగించి ఆన్లైన్ లో పరీక్షలు రాయమంటే ఎలా అని బాధపడుతున్నారు.

ఇక 2వ, 3 వ సంవత్సరం స్టూడెంట్స్ కి కూడా జూన్ 29 నుండి ఆన్లైన్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఇప్పటికే దేశమంతా విద్యాసంస్థలు ఆఫ్ లైన్ పరీక్షలు రద్దు చేసాయి. ఆన్లైన్ లో పరీక్షలు పెట్టాలని చూసినా అది సాధ్యం కాదని , అందరు పిల్లలకు ఇంటర్నెట్ సదుపాయం ఉండదని ఆన్లైన్ పరీక్షలు కూడా రద్దు చేసాయి. దీనికి ఉదాహరణే నిట్ దుర్గాపూర్.

ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ నిట్ విద్యార్థులు కూడా తమ పరీక్షలు రద్దు చేయాలనీ , ఆఫ్ లైన్ పరీక్షలు అయితే కేసులు పెరుగుతున్న కారణంగా తమ ఆరోగ్యాన్ని పణంగా పెట్టి పరీక్షలకు పంపడానికి తల్లి దండ్రులు ఒప్పుకోరని , తాము కూడా దైర్యం చేయలేరని చెప్తున్నారు. అంతే కాకుండా చదువుకోడానికి మెటీరియల్ కూడా అందుబాటులో లేదని, మరో వైపు కాలేజీ యాజమాన్యం ఎటువంటి నిర్ణయం తెలపకపోవటంతో పరీక్షలు ఎలా రాయలని ఒత్తిడితో మనో వేదనకు గురి అవుతున్నాం విద్యార్థులు తెలుపుతున్నారు.

ఎలా అయినా ప్రభుత్వం చొరవ తీసుకొని పరీక్షలు రద్దు చేసేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞపతి చేస్తున్నారు. దేశమంతా అన్ని విద్యాసంస్థలు పరీక్షలు రద్దు చేస్తుంటే నిట్ ఆంధ్ర ప్రదేశ్ యాజమాన్యం మాత్రం పిల్లల ఆరోగ్యం గురించి ఆలోచించట్లేదని విద్యార్థుల తల్లి తండ్రులు వాపోతున్నారు.ఆన్లైన్ పరీక్షలు పెడితే మాకు ఇంటర్నెట్ సౌకర్యం లేదని ఒక విద్యార్థి తండ్రి చెప్తున్నారు. పిల్లలను తరువాతి తరగతికి ప్రమోట్ చేయమని కాలేజీ యాజమాన్యానికి విజ్ఞప్తి చేస్తున్నారు.

అంతే కాకుండా విద్యార్థులు కూడా దీనిపై change.org లో పిటీషన్ ఫైల్ చేసారు.

నిట్ వరంగల్ కూడా పరీక్షలు రద్దు చేస్తూ నోటీసు జారీ చేసింది.

ఐఐటీ కాన్పూర్ కూడా పరీక్షలను రద్దు చేసింది

Read Previous

హత్య ? ఆత్మహత్య ? : మొదట మేనేజర్ ఇపుడు సుశాంత్

Read Next

అలర్ట్: బెల్లంపల్లి సింగరేణి కార్మికుడికి కరోనా పాజిటివ్