ఏపీ: ఒక్క రోజు కలెక్టర్ గా రైతు బిడ్డ … మొదటి సంతకం మహిళా ఉద్యోగుల కోసమే చేసిన బాలిక
Timeline

ఏపీ: ఒక్క రోజు కలెక్టర్ గా రైతు బిడ్డ … మొదటి సంతకం మహిళా ఉద్యోగుల కోసమే చేసిన బాలిక

అంతర్జారీయ బాలికల దినోత్సవం సందర్భంగా అనంతపురం కలెక్టర్ చంద్రుడు ‘బాలికే భవిష్యత్తు” పేరుతొ ఒక వినూత్న కార్యక్రమాన్నినిర్వహించారు. అనంతపురం జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులను లాటరీ పద్దతిలో ఎంపిక చేసి, ఒక బాలికను, అంతర్జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా ఒక్కరోజు కలెక్టరుగా భాద్యతలు నిర్వహించే అవకాశాన్ని కల్పించారు.

గార్లదిన్నె మండలం కస్తూరిబా పాఠశాలకు చెందిన శ్రావణి అనే బాలికకు ఒక్కరోజు కలెక్టరుగా ఉండే అవకాశం లభించింది. తానే కాకుండా జిల్లాలో మొత్తం 63 మంది తహసీల్దార్లు మరియు RIలు కూడా వారి స్థానాల్లో ఒక్క రోజు అధికారులుగా బాలికలకు అవకాశం ఇచ్చి, తమ సామాజిక స్ఫూర్తిని చాటుకున్నారు.

స్వయంగా కలెక్టర్ చంద్రుడు, శ్రావణిని తన అద్దికారిక కుర్చీలో కూర్చోపెట్టి కలెక్టర్ విధులను నిర్వహించడం ఎలాగో తెలిపారు. మహిళా ఉద్యోగులకు ఆఫీసు పనుల పేరుతొ రాత్రి 8 నుండి ఉదయం 8 వరకు ఫోన్లు కూడా చేయకూడదు అని రూల్ తీసుకొచ్చి , అది అమలు చేయాలనీ సంతకం చేసారు. అంతే కాకుండా దిశా చట్టం కింద పరిహారం అందవలసిన ఒక బాలికకు సంబంధించిన ఫైలుపై ఆమె ఈరోజు సంతకం చేశారు. సాయంత్రం వరకు శ్రావణి ఒక్క రోజు కలెక్టరుగా భాద్యతలు నిర్వహించారు.

బాలికలపై చూపుతున్న వివక్ష తగ్గి ఈవిధంగా అయినా బాలికల్లో పట్టుదల పెరిగి ఉన్నత స్థానాలను అధిరోహించాలని సదున్నత ఉద్దేశంతో అనంతపురం జిల్లాలో ఇటువంటి కార్యక్రమాన్ని నిర్వహించారు.