‘వాల్మీకి’ గెస్ట్ రోల్: సుకుమార్ తో పాటుగా పవన్ అభిమాని
Timeline

‘వాల్మీకి’ గెస్ట్ రోల్: సుకుమార్ తో పాటుగా పవన్ అభిమాని

మెగా హీరో వరుణ్‌ తేజ్‌ హీరోగా కమర్షియల్ చిత్రాల దర్శకుడు హరీష్‌ శంకర్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా వాల్మీకి. వరుణ్‌ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో మృణాలినీ రవి మరో హీరోయిన్‌గా నటిస్తున్నారు. 14 రీల్స్‌ ప్లస్‌ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ సినిమాకు మిక్కీ జే మేయర్‌ సంగీతమందిస్తున్నారు.

సినిమా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో పలువురు సినీ ప్రముఖులు అతిథి పాత్రల్లో కనిపించనున్నారని తెలుస్తోంది. ఇప్పటికే దర్శకుడు సుకుమార్ ఈ సినిమాలో గెస్ట్ అపియరెన్స్‌ ఇస్తున్నట్టుగా ప్రకటించారు. తాజాగా యంగ్‌ హీరో నితిన్‌ కూడా ఈ సినిమాలో కనిపించనున్నారన్న టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే నితిన్‌ కనిపించే సన్నివేశాల చిత్రీకరణ కూడా పూర్తయ్యిందట. అయితే ఈ వార్తలపై చిత్రయూనిట్‌ స్పందించాల్సి ఉంది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా ఈ నెల 20న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Leave a Reply

Your email address will not be published.