‘కామసూత్ర’ కథతో వెబ్ సిరీస్‌లో సన్నీలియోన్

5

బాలీవుడ్ ప్రముఖ నటి సన్నీలియోన్ ‘కామసూత్ర’ వెబ్ సిరీస్‌లో నటించనున్నట్టు తెలుస్తోంది. ఈ సిరీస్‌కు ఏక్తాకపూర్ దర్శకత్వం వహించనున్నట్టు బాలీవుడ్ భోగట్టా. ‘కామసూత్ర’లో నటించాలంటూ ఏక్తాకపూర్ ఇప్పటికే సన్నీని సంప్రదించినట్టు సమాచారం. కథ విన్న సన్నీకూడా సూత్రప్రాయంగా అంగీకరించినట్టు తెలుస్తోంది. అయితే, ఈ విషయంలో అధికారికంగా ప్రకటన వెలువడాల్సి ఉంది. గతంలో సన్నీ-ఏక్తాకపూర్‌లు ‘రాగిణి-ఎంఎంఎస్’ సినిమా కోసం కలిసి పనిచేశారు. కాగా, సన్నీలియోన్ ప్రస్తుతం తమిళ చిత్రం ‘వీరమాదేవి’ లో కీలకపాత్ర పోషిస్తోంది.