కీర్తి సురేష్ కి మహేష్ బాబు బర్త్ డే గిఫ్ట్ ..
Timeline

కీర్తి సురేష్ కి మహేష్ బాబు బర్త్ డే గిఫ్ట్ ..

సూప‌ర్ స్టార్ మ‌హేశ్ బాబు హీరోగా `గీత‌గోవిందం`వంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీని రూపొందించిన టాలెంటెడ్ డైరెక్ట‌ర్ ప‌ర‌శురామ్ ద‌ర్శక‌త్వంలో తెర‌కెక్కుతోన్న మ‌హేశ్ 27వ‌ చిత్రం `స‌ర్కారు వారి పాట`. ఇప్ప‌టికే ఈ చిత్రం నుండి విడుద‌లైన మోష‌న్‌పోస్ట‌ర్ ట్రెమండ‌స్ రెస్పాన్స్ తెచ్చుకుంది. కాగా ఈ మూవీలో మ‌హేశ్ బాబు స‌ర‌స‌న `మ‌హాన‌టి` చిత్రంతో నేష‌న‌ల్ అవార్డ్ ద‌క్కించుకున్న అందాల ముద్దుగుమ్మ కీర్తి సురేష్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. అక్టోబ‌ర్ 17 కీర్తి సురేష్ పుట్టినరోజు సందర్భంగా సూపర్‌స్టార్ మహేష్‌ బాబు ఆమెకు స్పెషల్ విషెస్‌ని చెప్పి, సర్కారు వారి పాటలోకి ఆహ్వానించారు.

`సూప‌ర్ టాలెంటెడ్‌ కీర్తికి బ‌ర్త్‌డే శుభాకాంక్ష‌లు. సర్కారు వారి పాట మీకు స్వాగతం పలుకుతోంది. ఈ సినిమా మీ కెరీర్‌లో ఎప్పటికీ గుర్తిండి పోయే గొప్ప సినిమాగా నిలుస్తుంది అని మహేష్ ట్వీట్ చేశారు.

దీనికి స్పందించిన కీర్తి సురేష్‌.. థ్యాంక్యూ సో మ‌చ్ మ‌హేష్ బాబు స‌ర్.. మొదటిసారి మీతో కలిసి పనిచేయడం ఆనందంగా ఉంది. ఆ క్ష‌ణం కోసం ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నాను అని తెలిపింది.

థమన్ ఎస్‌.ఎస్‌ సంగీతం అందిస్తుండ‌గా మైత్రీ మూవీ మేకర్స్, జీఎమ్ బి ఎంటర్టైన్మెంట్, 14 రీల్స్ ప్లస్ సంస్థలు ఈ ప్రెస్టీజియస్ మూవీని నిర్మిస్తున్నాయి.

సూప‌ర్‌స్టార్ మ‌హేశ్‌బాబు, కీర్తి సురేష్‌ న‌టిస్తున్న ఈ చిత్రానికి
సినిమాటోగ్ర‌ఫి: మ‌ధి,
ఎడిటర్: మార్తాండ్ కె. వెంకటేష్
ఆర్ట్ డైరెక్టర్: ఏఎస్ ప్రకాష్
సంగీతం: థమన్ ఎస్‌.ఎస్‌,
నిర్మాతలు: నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, రామ్ ఆచంట, గోపి ఆచంట
రచన, దర్శకత్వం: పరశురామ్ పెట్ల‌.