సుప్రీంకోర్టులో ఎల్జీ పాలిమర్స్‌కు మరోసారి చుక్కెదురైంది. ఫ్యాక్టరీని సీజ్ చేయాలని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై సుప్రీంకోర్టును ఎల్జీ పాలిమర్స్ ఆశ్రయించింది.
ఈ నేపథ్యంలో హైకోర్టు ఆదేశాలపై జోక్యం చేసుకోవడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. ఏ వాదనలనైనా హైకోర్టు, ఎన్జీటీ ముందే వినిపించాలని ఎల్జీని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది.
విశాఖ నగరం ఆర్ఆర్ వెంకటాపురం వద్ద ఉన్న ఎల్జి పాలిమర్స్ కంపెనీలో ఇటీవల చోటు చేసుకున్న స్టెరిన్ గ్యాస్ లీక్ ప్రమాదంలో 12 మృతిచెందిన విషయం తెలిసిందే.. ఈ ఈ ఘటన నేపథ్యంలో కంపెనీని మూసివేయాలని హైకోర్టు ఆదేశించింది. కంపెనీని వెంటనే మూసివేయాలని హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను నిలివేయాలని కోరారు.
అయితే హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై జోక్యం చేసుకోలేమని జస్టిస్ లలిత్ నేతృత్వంలోని ధర్మాసనం తేల్చిచెప్పింది. ఈ ఘటనపై హైకోర్టు లేదా ఎన్జిటి పూర్తిగా విచారణ చేపడతాయని పేర్కొంది. ఏ వాదనలనైనా హైకోర్టు, ఎన్జిటి ముందే వినిపించాలని స్పష్టం చేసింది.
అక్కడ విచారణ పూర్తి అయిన తరువాత మాత్రేమ సుప్రీం కోర్టుకు రావాలని సూచించింది. జూన్ 1న ఎల్జి పాలిమర్స్ కేసుపై ఎన్‌జిటిలో విచారణ జరగనుంది.
ప్లాంట్ లో ఉన్న పరిస్థితుల దృష్ట్యా అత్యవసరంగా వెళ్లేందుకు అనుమతివ్వాలని విజ్ఞప్తి చేశారు. విచారణ కోసం నియమించిన ఏడు కమిటీల్లో దేనికి హాజరుకావాలో అర్థం కాని పరిస్థితి నెలకొందని పిటిషన్లో పేర్కొంది.