మెట్రో రైలు ఉచిత ప్రయాణం.. నష్టాల గురించి కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది: సుప్రీం

ఢిల్లీ మెట్రో రైలులో ప్రయాణించే మహిళలను ఉచితంగా గమ్యస్థానాలకు చేర్చుతామన్న ఢిల్లీ సర్కార్ ప్రతిపాదనపై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. ప్రజాధనాన్ని పథకాలకు వెచ్చించే ముందు ఆచీతూచీ వ్యవహరించాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించిన అత్యున్నత న్యాయస్థానం.. మహిళలకు ఉచిత ప్రయాణం పథకంతో ఢిల్లీ మెట్రో రైలు కార్పొరేషన్ కి వచ్చే నష్టాల గురించి కూడా ఆలోచించాల్సిన అవసరం ఉందని సూచించింది.

ఢిల్లీ మెట్రో రైలులో మహిళలకు ఉచిత ప్రయాణం అందించే ప్రతిపాదనను పరిశీలిస్తామని ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ చేసిన ప్రకటనను సవాలు చేస్తూ ఎంసి మెహతా అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ చేపట్టిన సందర్భంలో సుప్రీం కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. మహిళలకు భద్రత కల్పించే ప్రయత్నంలో భాగంగా టికెట్ చార్జీలు అధికంగా ఉన్న ఢిల్లీ మెట్రో రైలుతో పాటు ఢిల్లీ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ బస్సులు, మెట్రోకు అనుసంధానంగా సేవలు అందించే క్లస్టర్ బస్సుల్లో మహిళలకు ఉచితంగా ప్రయాణించే వీలు కల్పిస్తామని జూన్ 3న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించిన సంగతి తెలిసిందే.

మహిళలకు భద్రత కల్పించే ప్రయత్నంలో భాగంగా టికెట్ చార్జీలు అధికంగా ఉన్న ఢిల్లీ మెట్రో రైలుతో పాటు ఢిల్లీ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ బస్సులు, మెట్రోకు అనుసంధానంగా సేవలు అందించే క్లస్టర్ బస్సుల్లో మహిళలకు ఉచితంగా ప్రయాణించే వీలు కల్పిస్తామని జూన్ 3న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించిన సంగతి తెలిసిందే.