సూర్యాపేటలో బాలుడి అదృశ్యం కలకలం రేపుతోంది. భగత్‌సింగ్‌నగర్ కాలనీకి చెందిన పరికపల్లి మహేశ్-నాగలక్ష్మిల కుమారుడు గౌతమ్ (5) నిన్న రాత్రి నుంచి కనిపించడం లేదు. రాత్రి 8 గంటల సమయంలో టపాసుల కోసం దుకాణానికి వెళ్లిన బాలుడు తిరిగి రాలేదు. దీంతో అర్ధరాత్రి వరకు వెతికిన తల్లిదండ్రులు.. చివరకు పోలీసులను ఆశ్రయించారు. రంగంలోకి దిగిన పోలీసు బృందాలు.. సీసీ కెమెరాల ఆధారంగా గౌతమ్ కోసం గాలిస్తున్నాయి. ఆత్మకూరు మండలం ఏపూర్‌కు చెందిన మహేశ్ లారీ డ్రైవర్‌గా పనిచేస్తూ సూర్యాపేటలో నివాసముంటున్నాడు. ఇటీవల మహబూబాబాద్‌లో బాలుడి అదృశ్యం విషాదాంతమైన నేపథ్యంలో తాజాగా సూర్యాపేటలో జరిగిన ఘటన ఆందోళనకు గురిచేస్తోంది.