హత్య ? ఆత్మహత్య ? : మొదట మేనేజర్ ఇపుడు సుశాంత్
Timeline

హత్య ? ఆత్మహత్య ? : మొదట మేనేజర్ ఇపుడు సుశాంత్

బాలీవుడ్ హీరో సుషాంత్ సింగ్ ముంబైలోని తన ఇంట్లో ఆత్మహత్య కారణంగా చనిపోయాడు.

ఏప్రిల్ నెలలో ఇర్ఫాన్ ఖాన్, రిషి కపూర్ మరిణించిన కొద్ది రోజులకే బాలీవుడ్ మరో స్టార్ కన్నుమూశారు. సుషాంత్(34) మరణం వెనుక మరిన్ని విషయాలు తెలియాల్సి ఉంది. 2019లో రిలీజ్ అయిన చిచ్చోరె సినిమా అతని ఆఖరి సారిగా కనిపించింది. శ్రద్ధా కపూర్ తో జోడీగా నటించిన సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అయింది. 

ఇతనికి రియా కపూర్ కు రిలేషన్ ఉందని రూమర్లు వచ్చాయి. సిటీలో తరచూ తిరుగుతూ కెమెరాలకు చిక్కడంతో వీరిపై రూమర్లు మిన్నంటాయి. సుశాంత్ సినిమాల కంటే టీవీషోలతోనే ఎక్కువ ఫ్యామస్ అయ్యాడు. బాలీవుడ్ లోకి ‘కై పో చె’ సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు. 2012లో పీకే, కేదర్ నాథ్ వంటి సూపర్ హిట్ సినిమాల్లోనూ కనిపించాడు. 

అతని కెరీర్లో సూపర్ హిట్ మూవీ అంటే ఎంఎస్ ధోనీ. దీనిని ముఖేశ్ చాబ్రాతో పాటు దిల్ బెచారా, సంజనా సంఘీ డైరక్ట్ చేశారు. ఇది హాలీవుడ్ హిట్ సినిమా ద ఫాల్ట్ ఇన్ అవర్ స్టార్స్ రీమేక్. సుషాంత్ సింగ్ రాజ్ పుత్ చివరి సోషల్ మీడియా పోస్టు ఆమె తల్లి ఫొటోను తనది కలిపి షేర్ చేశాడు. 

సుశాంత్ 5-6నెలలుగా డిప్రెషన్ లోకి ఉంటున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అతను రెగ్యూలర్ గా వెళ్లే హిందూజా హాస్పిటల్ డాక్టర్ అతనికి ట్రీట్‌మెంట్ ఇస్తున్నట్లుగా తెలిసింది. డాక్టర్ ఇచ్చిన స్టేట్‌మెంట్‌ను రికార్డ్ చేశారు.

రాజ్‌పుత్ అతని మేనేజర్ కూడా డిప్రెషన్ తో ఉంటున్నాడని చెప్పారు. అలా ఉంటున్నా అతను దానికి సంబంధించిన మెడిసిన్ తీసుకోవడం మానేశాడని ముంబై పోలీసులు చెబుతున్నారు. 

ఈ క్రమంలో అసలు సుశాంత్ చివరిగా ఎవరితో మాట్లాడాడనే విషయాన్ని ఆరా తీయగా.. సుశాంత్ ఆదివారం ఉదయం 6:30 గంటలకు లేచిన తరువాత తన గదిలోనే ఉన్నాడు. ఉదయం 9:30 గంటలకు సుశాంత్ దానిమ్మ రసం తీసుకొని తన గదిలో తాళం వేసుకున్నాడు. సుశాంత్‌ను అతని కుక్ చూడటం ఇదే చివరిసారి. ఉదయం 10:30 గంటలకు, వంట కోసం సుశాంత్‌ను ఏమి తినాలని అడిగినా.. సుశాంత్ తలుపు తెరవలేదు.

అనంతరం మధ్యాహ్నం 12 గంటలకు భోజనానికి ఏమి తినాలి అని అడగడానికి వంట మనిషి మళ్ళీ సుశాంత్ దగ్గరకు వెళ్ళాడు, ఈసారి సుశాంత్ తలుపు తెరవలేదు. చాలాసేపు తలుపులు కొట్టి సుశాంత్‌ని పిలిచిన తర్వాత, కుక్ సహా మిగతా ఇద్దరు పనిమనుషులకు ఎటువంటి సమాధానం రాలేదు. దీంతో ఓ పనిమనిషి 12గంటల 15నిమిషాలకు సోదరిని పిలిచి మొత్తం విషయం చెప్పాడు. గోరేగావ్‌లో నివసించే సుశాంత్ సోదరి సమాచారం అందుకుని సుమారు 40 నిమిషాల్లో బాంద్రాకు చేరుకుంది.

సోదరి వచ్చిన తర్వాత తలుపు పగలగొట్టి లోపలికి ప్రవేశించగా.. సుశాంత్ శరీరం ఆకుపచ్చ కుర్తాకు వేలాడుతోంది. వెంటనే, కుర్తాలో కొంత భాగాన్ని కత్తితో కోసి సుశాంత్‌ను కిందకు దింపారు. వైద్యుడిని పిలిచి పోలీసులకు సమాచారం అందించారు.

ముంబై పోలీస్ క్రైమ్ బ్రాంచ్ బృందం పడకగదిలో పంచనామ చేసింది. పోలీసు వర్గాల సమాచారం ప్రకారం.. సుశాంత్ సింగ్ ఆరు నెలలుగా ముంబైలోని ఒక ప్రముఖ మానసిక వైద్యుడి దగ్గర డిప్రెషన్‌కు చికిత్స పొందుతున్నాడు. ఇంట్లో అందుకు సంబంధించిన మెడిసిన్ ప్రిస్క్రిప్షన్ కనిపించింది. తన సోదరుడికి ఎటువంటి సమస్య లేదని, ఆర్థికంగా ఇబ్బందులు లేవని సుశాంత్ సోదరి పోలీసులకు తెలిపింది.

ఇక సుశాంత్ చివరిసారిగా.. తన పాత స్నేహితుడు, టీవీ నటుడు మహేష్ కృష్ణ శెట్టితో చాలాకాలం తర్వాత మాట్లాడారు. మహేష్ సుశాంత్‌తో కలిసి ‘ప్రీతా రిష్ట’ సీరియల్‌లో పనిచేశారు. మహేష్ వాంగ్మూలాన్ని కూడా ముంబై పోలీసులు రికార్డ్ చేస్తారు.

ఈ నేపథ్యంలో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ బంధువు సంచలన ఆరోపణలు చేశారు. పాట్నాలో నివాసం ఉంటున్న సుశాంత్ సింగ్‌ దగ్గరి బంధువు యువ నటుడు ఆత్మహత్య చేసుకున్నాడన్న వార్తలను ఖండించారు. సుశాంత్ అంకుల్ ఆర్‌ సీ సింగ్ నవభారత్‌ టైమ్స్ ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సుశాంత్ ఎంతో ధైర్యవంతుడని, ఆయన ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడని కాదని ఆయన చెప్పారు.

అంతేకాదు ఇటీవల మరణించిన సుశాంత్ సింగ్ మాజీ మేనేజర్‌ దిశ సలైన్‌ను కూడా ఎవరో హత్య చేశారని, దానికి కొనసాగింపుగానే సుశాంత్‌ను కూడా హత్య చేసిన ఉంటారని ఆయన ఆరోపించారు. సుశాంత్ మృతదేశాన్ని పోస్ట్‌మార్టమ్‌ కోసం కూపర్‌ హాస్పిటల్‌కు తరలించారు. అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published.