బిగ్ బ్రేకింగ్: ఎస్వీబీసీ ఛైర్మన్‌ పదవికి పృథ్విరాజ్‌ రాజీనామా

ఎస్వీబీసీ ఛైర్మన్‌ పదవికి పృథ్వీ రాజ్‌ రాజీనామా చేశారు. ఆ పదవికి రాజీనామా చేయాలని టీటీడీ ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి..పృథ్వీని కోరినట్లు సమాచారం.

ఈ వ్యవహారాన్ని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి దృష్టికి టీటీడీ ఛైర్మన్‌ తీసుకెళ్లగా.. పృథ్విపై చర్యలు తీసుకోవాలని సీఎం జగన్‌ ఆదేశించారు. ఆడియో టేపుల వ్యవహారాన్ని టీటీడీతో పాటు పార్టీ హైకమాండ్‌ సీరియస్‌గా పరిగణించింది.

మహిళా ఉద్యోగినితో అసభ్యంగా మాట్లాడిన పృథ్వీ రాజ్‌ను వెంటనే పదవి నుంచి తొలగించాలని రాష్ట్రవ్యాప్తంగా శ్రీవారి భక్తులు, పలు సంఘాలు డిమాండ్లు చేశాయి. ఐతే దీనిపై టీటీడీ ఇప్పటికే విచారణకు కూడా ఆదేశించింది. అంతకుముందు రాజధాని రైతులపై పృథ్వి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం చెలరేగింది.

కొత్త వార్తలు

సినిమా

రాజకీయం