మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా నటించిన సైరా-నరసింహారెడ్డి అక్టోబర్ 2న ప్రపంచవ్యాప్తంగా రిలీజవుతున్న సంగతి తెలిసిందే. తెలుగు-తమిళం-హిందీ-మలయాళం-కన్నడలో అత్యంత భారీగా రిలీజ్ చేసేందుకు కొణిదెల కంపెనీ సన్నాహాలు చేస్తోంది.

ఇప్పటికే ప్రీరిలీజ్ బిజినెస్ గురించి ఆసక్తికర చర్చ సాగుతోంది. తాజా సమాచారం ప్రకారం.. సైరా అన్ని భాషల డిజిటల్ రైట్స్ ను కలుపుకుని 40కోట్లకు అమెజాన్ ప్రైమ్ డీల్ కుదుర్చుకుందని ప్రచారం సాగుతోంది. అయితే ఇది నిజమా? ఇటీవలే రిలీజైన సాహో డిజిటల్ రైట్స్ కూడా అంత పెద్ద ధర పలకలేదు. బాహుబలి స్టార్.. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన సినిమా అంటూ బోలెడంత ప్రచారం జరిగినా డిజిటల్ రైట్స్ ఆ స్థాయికి వెళ్లలేదు.

అయితే తాజా ప్రచారంలో నిజం ఎంత అన్నది కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ చెప్పాల్సి ఉంటుంది. సౌతిండియాలోనే బెస్ట్ డీల్ అని చెబుతున్నా దానిని అధికారికంగా ధృవీకరించాల్సి ఉంది. సైరా రిలీజ్ కి ఇంకో 22 రోజుల సమయం మిగిలి ఉంది. ప్రస్తుతం వీఎఫ్ ఎక్స్ పనులు సహా పెండింగ్ పనులన్నీ పూర్తి చేస్తున్నారని తెలుస్తోంది. ఇటీవల రిలీజైన సైరా టీజర్ అంచనాల్ని పెంచింది. తదుపరి ట్రైలర్ రాక కోసం అభిమానులు వెయిటింగ్.

ఈనెల 18న కర్నూలులో ప్రీరిలీజ్ వేడుక అంటూ ప్రచారం సాగుతున్నా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ప్రీరిలీజ్ వేదికపైనే ట్రైలర్ లాంచ్ ఉంటుందని మెగా ఫ్యాన్స్ ఆసక్తిగా వేచి చూస్తున్నారు. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Leave a Reply

Your email address will not be published.