సైరాకి జీఎస్టీ దెబ్బ.. శిస్తు కట్టాల్సిందే

12

చిరంజీవి నటించిన సైరా చిత్రం తెలుగురాష్ట్రాల్లో భారీ వసూళ్లు నమోదు చేస్తూ దూసుకెళ్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చిత్ర బయ్యర్లుకు కొత్త చిక్కు వచ్చి పడింది అదే జీఎస్టీ. కేంద్రప్రభుత్వం అన్నింటి ఫై జీఎస్టీ వేస్తున్న సంగతి తెలిసిందే. ప్రతి ఒక్కరు కూడా జీఎస్టీ కట్టాలి. ఈ నేపథ్యంలో సైరా థియేటర్స్ ఫై టాస్క్ ఫోర్స్ అధికారులు దాడులు నిర్వహించారు.

ఈస్ట్ గోదావరి జిల్లాలోని పలు థియేటర్లలో జీఎస్టీ టాస్క్ ఫోర్స్ అధికారులు దాడులు నిర్వహించారట. అక్కడ లెక్కలు అన్ని సరిగా ఉన్నాయా లేవా అనే విషయాన్ని పరిశీలించారని తెలుస్తోంది. కేవలం ఇక్కడే కాదు తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్స్ అన్నింట్లో దాడులు జరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం.