అవును, రిలేషన్‌ షిప్‌లో ఉన్నాను. పెళ్లి మాత్రం…

3

తాప్సీ తెలుగు ఇండస్ట్రీకి బైబై చెప్పింది కానీ ఇంకా ఆమె గురించి ఇక్కడ చర్చలు మాత్రం జరుగుతున్నాయి. అప్పుడప్పుడూ కథ నచ్చితే ఇక్కడ కూడా నటిస్తుంది తాప్సీ. హీరోయిన్ తాప్సీ రహస్యంగా ప్రేమాయణం నడుపుతున్నట్లు, ఆమె జీవితంలో ఒక వ్యక్తి ఉన్నట్లు కొన్ని రోజులుగా మీడియాలో వార్తలు వస్తూనే ఉన్నాయి.

కానీ ఇప్పుడు మాత్రం పెళ్లితో వార్తల్లోకి వచ్చింది ఈ బ్యూటీ. ఈ మధ్యే ఓ ఇంటర్వ్యూలో భాగంగా తనకు కాబోయే వాడి గురించి కూడా చెప్పింది తాప్సీ. తన జీవితంలో ఒక ప్రత్యేకమైన వ్యక్తి ఉన్నట్లు చెప్పింది ఈ ముద్దుగుమ్మ. తాను చాలా రోజులుగా రిలేషన్‌ షిప్‌లో ఉన్నట్లు ఒప్పుకుంది తాప్సీ. అయితే తన బాయ్ ఫ్రెండ్ విషయం మాత్రం చెప్పలేదు ఈమె.

తన జీవితంలో ఉన్న వ్యక్తి అందరూ ఊహించినట్లు ఇండస్ట్రీికి చెందిన వ్యక్తి కాదు, అలా అని క్రికెటర్ అసలే కాదు అని తాప్సీ స్పష్టం చేశారు. ఇలా చెప్పడం ద్వారా ఇతర స్టార్లతో తనకు లింకప్ పెట్టి ఊహాగానాలతో కూడిన వార్తలు రాకుండా కట్టడి చేసే ప్రయత్నం చేశారు.

నాకు ఎప్పుడు పిల్లలు కావాలనిపిస్తుందో అప్పుడే నేను పెళ్లి చేసుకుంటాను. వివాహం అయిన తర్వాతే పిల్లలను కనాలని అనుకుంటున్నాను. వివాహాన్ని కూడా ఆడంబరంగా జరుపుకోవాలని అనుకోవడం లేదు. ఒకే రోజులో స్నేహితులు, కుటుంబ సభ్యుల మధ్య వివాహం చేసుకోవాలని ఉంది, ఎక్కువ రోజులు వివాహ వేడుక వల్ల అంతా అలసిపోతారు అని తాప్సీ చెప్పుకొచ్చారు.