కాంగ్రెస్ పార్టీ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క సవాల్‌ను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్వీకరించారు. నిన్న అసెంబ్లీలో భట్టి మాట్లాడుతూ హైదరాబాద్‌లో డబుల్ బెడ్ రూం ఇళ్ల కోసం ఎన్ని దరఖాస్తులు వచ్చాయి? ఎంత మందికి ఇచ్చారో చెప్పాలని సవాల్ విసరగా, దానికి తలసాని రేపు ఉదయం మీ ఇంటికి వస్తానని మిమ్మల్ని తీసుకెళ్ళి ఎక్కడెక్కడ తమ ప్రభుత్వం ఇళ్ళు నిర్మించిందో చూపిస్తానని అన్నారు.
అయితే చెప్పినట్టే కొద్దిసేపటి క్రితం మంత్రి తలసాని, జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్ భట్టి ఇంటికి చేరుకున్నారు. ఈ నేపధ్యంలో భట్టీ ఇంటికి కాంగ్రెస్, టీఆర్ఎస్ నేతలు పెద్ద ఎత్తున చేరుకున్నారు. అయితే కొద్ది సేపటి క్రితమే మంత్రి తలసాని కారులో భట్టిని కూడా ఎక్కించుకుని డబుల్ బెడ్రూం ఇళ్లను చూసేందుకు ముందుగా జియాగూడకు వెళ్ళినట్టు తెలుస్తుంది. కాగా నగర శివారులో నిర్మించిన మొత్తం ఇళ్ళను పరిశీలించాక ఇరువురు నతలు కలిసి మీడియా మీట్ నిర్వహించనున్నారని సమాచారం.