పవన్ సినిమాపై తమన్ క్లారిటీ

జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్ సినిమా రీ ఎంట్రీ మీద క్లారిటీ ఇచ్చాడు సంగీత దర్శకుడు తమన్‌. అల వైకుంఠపురములో సినిమా సూపర్‌ హిట్ అయిన సందర్భంగా తమన్‌కు శుభాకాంక్షలు తెలుపుతూ ఓ ఫ్లవర్‌ బొకేను పంపించాడు పవన్‌. పవర్‌ స్టార్‌ నుంచి శుభాకాంక్షలు అందుకున్న తమన్‌ ఆ ఆనందాన్ని అభిమానులతో పంచుకున్నాడు.

తన ట్విటర్‌ పేజ్‌లో పవన్‌ పంపిన ఫ్లవర్‌ బొకే ఫోటోను ట్వీట్ చేసిన తమన్‌, నేను ఆరాధించే వ్యక్తి నుంచి ఇలాంటి గిఫ్ట్ రావటం ఆనందంగా ఉంది. ఇది మన నాయకుడు ఫ్యూచర్‌ పవర్‌ పవన్‌ కళ్యాణ్‌ గారి నుంచి వచ్చింది. కృతజ్ఞతలు సార్‌. ప్రస్తుతం ఆయన సినిమాకు పాటలు కంపోజ్‌ చేయటం ఆనందంగా ఉంది. బిగ్గెస్ట్ ఫ్యాన్‌ మూమెంట్ అంటూ ట్వీట్ చేశాడు.

కొత్త వార్తలు