తెలంగాణ గవర్నర్: నరసింహన్‌ నేడు వీడ్కోలు.. సౌందరరాజన్ రేపు ప్రమాణస్వీకారం
Timeline

తెలంగాణ గవర్నర్: నరసింహన్‌ నేడు వీడ్కోలు.. సౌందరరాజన్ రేపు ప్రమాణస్వీకారం

ఏపీ, తెలంగాణ ఉమ్మడి గవర్నర్‌గా పనిచేసిన ఈఎస్‌ఎల్ నరసింహన్‌ త్వరలో బదిలీ కానున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి డిసెంబర్ 27, 2009లో గవర్నర్‌గా నరసింహన్‌ బాధ్యతలు చేపట్టారు. అయితే రాష్ట్ర విభజన తరువాత కూడా తెలంగాణ, ఏపీలకు ఉమ్మడి గవర్నర్‌గా వ్యవహరించారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గవర్నర్‌గా పని చేసిన కృష్ణకాంత్ కంటే ఎక్కువకాలం పనిచేసిన ఘనతను నరసింహన్ సొంతం చేసుకున్నారు. తెలుగు రాష్ట్రాలకు ఎనలేని సేవలు అందించిన గవర్నర్ నరసింహన్‌కి ఘనంగా వీడ్కోలు పలికేందుకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.

అయితే తెలంగాణకు కొత్త గవర్నర్‌గా తమిళ ఇసై సౌందరరాజన్‌ని నియమితులయ్యారు. ఈ నెల 8న ఆదివారం ఆమె బాధ్యతలు తీసుకోబోతున్నారు. ఈ రోజు సాయంత్రం 6 గంటలకు జరగనున్న గవర్నర్ నరసింహన్‌ వీడ్కోలు కార్యక్రమానికి సీఎం కేసీఆర్, మంత్రులు హాజరుకాబోతున్నారు. అనంతరం నరసింహన్‌ చెన్నై బయలుదేరనున్నారు.

అయితే రేపు ఉదయం 11 గంటలకు రాజ్‌భవన్‌లో రాష్ట్ర హైకోర్టు చీఫ్ జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్ సమక్షంలో తమిళ ఇసై సౌందరరాజన్ తెలంగాణ గవర్నర్‌గా ప్రమాణస్వీకారం చేయనున్నారు.

Leave a Reply

Your email address will not be published.