వైసీపీలో చేరిన బీద మస్తాన్‌రావు

ఏపీ సీఎం జగన్ సమక్షంలో మాజీ ఎమ్మెల్సీ బీద మస్తాన్ రావు అధికార వైసీపీ లో చేరిపోయారు. ఆతరువాత ఏర్పాటు చేసిన మీడియా సమాక్షంలో మాట్లాడిన మస్తాన్‌రావు రాష్ట్రంలో సీఎం జగన్ పాలన భేషుగ్గా ఉందని వాఖ్యానించారు. అంతేకాకుండా సీఎం తండ్రిగారైన రాజశేఖర్ రెడ్డి గారు చేయలేని పనులన్నింటిని కూడా సీఎం జగన్ చేస్తున్నారని, మహిళలు, మైనార్టీలు, బీసీల కోసం సీఎం జగన్‌ పనిచేస్తున్నారని కితాబిచ్చారు. అయితే టీడీపీ పార్టీలో కొందరి నేతల వైఖరి వల్లే తాను టీడీపీ పార్టీని వదిలినట్లు చెప్పుకొచ్చారు మస్తాన్ రావు.

కొత్త వార్తలు