బ్రేకింగ్ వీడియో: చంద్రబాబుకు తృటిలో ప్రమాదం

మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబుకు తృటిలో ప్రమాదం తప్పింది. ఆవు అడ్డురావడంతో ఎస్కార్ట్ వాహనం డ్రైవర్ సడన్ బ్రేక్ వేయగా.. చంద్రబాబు కాన్వాయ్లోని రెండు వాహనాలు ఢీకొన్నాయి.

విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్తుండగా చౌటుప్పల్ మండలం దండు మల్కాపురం వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

కాగా ప్రతి శనివారం హైదరాబాద్లోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో తెలంగాణ టీడీపీ నేతలకు చంద్రబాబు అందుబాటులో ఉంటారు.

బుల్లెట్ ప్రూఫ్ వాహనం ఒక్కసారిగా కాన్వాయ్‌లోని ముందు ఉన్న ఎస్కార్ట్ వాహనాన్ని ఢీ కొట్టింది. ఆ తర్వాతి వాహనంలోనే చంద్రబాబు ఉన్నారు. బాబు క్షేమంగానే ఉన్నారు. ఈ ఘటనలో వాహనం ముందు భాగం దెబ్బతిన్నది. స్వల్పగాయాలతో మరో వాహనంలో భద్రతా సిబ్బంది వెళ్లింది. విజయవాడ నుంచి హైదరాబాద్‌ వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
చౌటుప్పల్ మండలం దండుమల్కాపురం దగ్గర ఘటన జరిగింది.

కాగా.. పెద్ద ప్రమాదమేమీ జరగకపోవడంతో సెక్యూరిటీ సిబ్బంది ఊపిరిపీల్చుకున్నారు. ఈ ఘటన అనంతరం మళ్లీ యథావిధిగా కాన్వాయ్‌ హైదరాబాద్‌కు పయనమైనట్లు తెలియవచ్చింది. ఇందుకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.