దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ను దుగ్గిరాల లోని ఇంటి వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చింతమనేని ని అరెస్ట్ చేయడానికి గత నెల 30 నుండి 12 బృందాలుగా పోలీసులు వెతుకుతున్నారు. అనారోగ్యంతో చికిత్స పొందుతున్న భార్యను చూసేందుకు వచ్చిన చింతమనేని ని ఇంటి వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చింతమనేనికి మద్దతుగా కార్యకర్తలు భారీగా తరలివచ్చారు.
అరెస్టు నేపథ్యంలో పోలీసులకు చింతమనేని అనుచరులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఉద్దేశపూర్వకంగా చింతమనేని పై తప్పుడు కేసులు బనాయిస్తున్నారు అంటూ.. టిడిపి నేతలు ఆరోపించారు. చింతమనేనిని అరెస్ట్ చేసి తీసుకెళుతున్న పోలీస్ వాహనాన్ని గోపన్నపాలెం గ్రామస్థులు అడ్డుకున్నారు.