Breaking News :

జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన టీడీపీ నేత

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగినటువంటి ఎన్నికల్లో అప్పటి అధికార తెలుగు దేశం పార్టీ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా దారుణమైన ఓటమిని కూడగట్టుకున్న సంగతి మనకు తెలిసిందే. కాగా ఇక అప్పటినుండి కూడా పార్టీ పైన నమ్మకం లేని వారందరు కూడా పార్టీ ని వదిలి రాష్ట్రంలోని ఇతర పార్టీలో చేరిపోతున్నారు. కాగా కొందరు అధికార వైసీపీ లో చేరుతుంటే, మరికొందరు బీజేపీ లో చేరుతున్నారు. అయితే ఈ వలసలు ఇప్పటికి కూడా ఆగడం లేదనే చెప్పాలి. అయితే తాజాగా మరొక టీడీపీ నేత పార్టీకి వీడ్కోలు పలికి అధికార వైసీపీ లో చేరిపోయారు.

కాగా శనివారం నాడు సీఎం జగన్ సమక్షంలో మాజీ ఎమ్మెల్సీ బీద మస్తాన్ రావు అధికార వైసీపీ లో చేరిపోయారు. ఆతరువాత ఏర్పాటు చేసిన మీడియా సమాక్షంలో మాట్లాడిన మస్తాన్‌రావు రాష్ట్రంలో సీఎం జగన్ పాలన భేషుగ్గా ఉందని వాఖ్యానించారు. అంతేకాకుండా సీఎం తండ్రిగారైన రాజశేఖర్ రెడ్డి గారు చేయలేని పనులన్నింటిని కూడా సీఎం జగన్ చేస్తున్నారని, మహిళలు, మైనార్టీలు, బీసీల కోసం సీఎం జగన్‌ పనిచేస్తున్నారని కితాబిచ్చారు. అయితే టీడీపీ పార్టీలో కొందరి నేతల వైఖరి వల్లే తాను టీడీపీ పార్టీని వదిలినట్లు చెప్పుకొచ్చారు మస్తాన్ రావు…

Read Previous

దిశ ఎన్ కౌంటర్ పై సుప్రీంకోర్టులో పిటిషన్

Read Next

ప్రయివేట్ స్కూల్స్ లో నర్సరీ, ఎల్కేజీలు పీకేసిన ప్రభుత్వం