తెదేపా నేత, చంద్రబాబు సన్నిహితుడు, మాజీ మంత్రి కొల్లు రవీంద్రను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తూర్పుగోదావరి జిల్లాలోని తుని మండలం సీతాపురం జాతీయ రహదారిపై అదుపులోకి తీసుకున్నారు.
విశాఖ వైపు వెళ్తున్న రవీంద్రను మధ్యలోనే ఆపిన మఫ్టీలో ఉన్న కృష్ణా జిల్లా పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. అనంతరం తుని నుంచి విజయవాడకు తరలిస్తున్నట్టు తెలుస్తోంది.
ADVERTISEMENT
ADVERTISEMENT
మచిలీపట్నంలో వైకాపా నేత, మంత్రి పేర్ని నాని అనుచరుడు మోకా భాస్కరరావు హత్య కేసులో రవీంద్ర ప్రమేయంపై ఆరోపణలు వచ్చాయి. ఈ హత్య కేసులో రవీంద్ర పాత్రపై కేసు నమోదు చేసిన పోలీసులు మూడు బృందాలను ఏర్పాటు చేసి గాలిస్తున్నారు. కొల్లు రవీంద్ర ప్రోద్బలంతోనే హత్య చేసినట్టు నిందితుడు పేర్కొన్నాడని పోలీసులు వెల్లడించారు.