అక్రమ కేసులపై టీడీపీ ఆగ్రహం.. పోలీసులపై కోర్టులో ప్రైవేట్‌ కేసులకు సిద్ధం

పోలీసులపై కోర్టులో ప్రైవేట్‌ కేసు దాఖలకు టిడిపి సిద్ధమైంది. మంగళవారం తెలుగుదేశం న్యాయ విభాగం గుంటూరులో సమావేశం కానుంది. చంద్రబాబు అధ్యక్షతన నిర్వహించనున్న ఈ భేటీకి… రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న టిడిపి అనుబంధ న్యాయవాదులు తరలిరానున్నారు.

టిడిపి నాయకులు, కార్యకర్తలపై ప్రభుత్వం అక్రమ కేసులు బనాయిస్తోందంటున్న తెలుగుదేశం… సమర్థంగా ఎదుర్కొనేందుకు న్యాయ విభాగాన్ని పటిష్టం చేయాలని నిర్ణయించింది. అవసరమైతే పోలీసులపై కోర్టుల్లో ప్రైవేట్‌ కేసుల దాఖలుకు సిద్ధమవుతోంది. సంబంధిత అంశాలపై న్యాయ విభాగ సభ్యులతో చంద్రబాబు చర్చించనున్నారు.