వారు ఆశించింది వేరు.. మీరు ఇచ్చింది వేరు

13

హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో బీజేపీ పోటీ చేస్తుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ తెలిపారు. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన తర్వాత తమ అభ్యర్థిని ప్రకటిస్తామని పేర్కొన్నారు.

ఇటు కేసీఆర్‌పై విమర్శలు చేశారు లక్ష్మణ్. సింగరేణి కార్మికులు 30 శాతం బోనస్ ఆశించారని పేర్కొన్నారు. కానీ తెలంగాణ ప్రభుత్వం 28 శాతం ఇచ్చిందని గుర్తుచేశారు. ప్రభుత్వం చేసిన అప్పులతో సింగరేణి సంస్థ ఇబ్బందులు పడుతుందన్నారు. ప్రభుత్వం అప్పును సింగరేణి కార్మికులపై రుద్దడం సబబుకాదని పేర్కొన్నారు. సింగరేణి, ఆర్టీసీ, విద్యుత్ సంస్థలను కెసిఆర్ అప్పుల్లోకి నెట్టారని ధ్వజమెత్తారు.