Breaking News :

సిఏఏను వ్యతిరేకిస్తూ తెలంగాణ అసెంబ్లీలో తీర్మానం చేయడం రాజ్యాంగ వ్యతిరేకం

సిఏఏను వ్యతిరేకిస్తూ తెలంగాణ అసెంబ్లీలో తీర్మానం చేయడం రాజ్యాంగ వ్యతిరేకం అని రాష్ట్ర బిజెపి నేతలు విమర్శించారు. రాజ్యాంగ స్ఫూర్తిని విస్మరించి సీఏఏకు వ్యతిరేకంగా తీర్మానం చేశారని రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. 

సీఏఏ, ఎన్‌పీఆర్‌ తీర్మానాలను ఉపసంహరించుకునేందుకు అసెంబ్లీ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.  మజ్లిస్‌ పార్టీ నేతల మెప్పుకోసం సీఎం కేసీఆర్‌ అసెంబ్లీలో సీఏఏకు వ్యతిరేకంగా తీర్మానం ఆమోదింపజేశారని ఆరోపించారు. 

కేసీఆర్ ప్రజలను తప్పుదోవపట్టించే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు. సీఏఏ, ఎన్‌పీఆర్‌పై అపోహలు సృష్టించి కేసీఆర్‌ గందరగోళానికి తెరలేపారని వారు విమర్శించారు. చట్టానికి వ్యతిరేకంగా తీర్మానం చేయడం అంటే భారత రాజ్యాంగాన్ని, అంబేద్కర్‌ను అవమానించడమేనని వారు మండిపడ్డారు. 

ఏప్రిల్‌ నుంచి రాష్ట్రంలో ఎన్‌పీఆర్‌ ప్రక్రియ జరపడానికి ఏర్పాట్లు చేయాలని డిమాండ్ చేశారు.  కేసీఆర్‌ తక్షణం రాష్ట్ర పజలకు క్షమాపణలు చేప్పాలని డిమాండ్‌ స్పష్టం చేశారు. బంగ్లాదేశ్‌ నుంచి శరణార్థిగా వచ్చిన తస్లీమాపై దాడికి పాల్పడిన మజ్లిస్‌ నాయకులు సీఏఏను వ్యతిరేకించడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. 

గవర్నర్ ను కలిసిన వారిలో బిజెపి మాజీ రాష్ట్ర అధ్యక్షుడు డా. కె లక్ష్మణ్, మాజీ మంత్రులు డీకే అరుణ, మోత్కుపల్లి నర్సింహులు, ఎమ్యెల్సీ ఎన్ రామచంద్రరావు తదితరులు ఉన్నారు. 

Read Previous

ఫేక్ లెటర్ తో జగన్ పై ఈనాడు విషం

Read Next

కరోనా వైరస్: పోరాటం ముగించుకొచ్చిన ‘నారప్ప’