వైరల్ అవుతున్న బండి సంజయ్ TRS ఫోటో

కొద్ది రోజులుగా తెలంగాణలో కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ పేరు బాగా వినిపిస్తోంది. తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఆయన్ను కేంద్రం నియమించిన సంగతి తెలిసిందే. ఆయన తెలంగాణకు వచ్చి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించబోతున్నారు. ఘనస్వాగతం పలికేందుకు బీజేపీ శ్రేణులు శంషాబాద్ విమానాశ్రయం వద్ద చాలా ఏర్పాట్లు చేశాయి.

అయితే ఇప్పుడు తెరాస కార్యకర్తలు అయన తెరాస జాగృతి కోసం కరీంనగర్ లో పనిచేసినప్పటి ఒక ఫోటోని షేర్ చేసారు. అది ఇపుడు వైరల్ అవుతుంది

అయితే అది తెరాస ఫోటో కాదు. అయన తెరాస లో పని చేయలేదు కానీ కెసిఆర్ కూతురు స్థాపించిన తెలంగాణ జాగృతి అనే ఆర్గనైజేషన్ లో అప్పటి కరీంనగర్ మేయర్ గా ఉన్నపుడు కొన్ని కార్యక్రమాల్లో పాల్గొన్నప్పటి ఫోటో అని బీజేపీ కార్యకర్తలు చెప్తున్న మాట

Read Previous

భారత్ లో మూడో కరోనా మృతి

Read Next

కవిత రీఎంట్రీ కన్ఫార్మ్.. రేపు నిజామాబాద్ నుండి ఎమ్మెల్సీ గా నామినేషన్

Leave a Reply

Your email address will not be published.