కెసిఆర్ ముచ్చట్లు @ ధరణి లాంచ్
Timeline

కెసిఆర్ ముచ్చట్లు @ ధరణి లాంచ్

సీఎం కేసీఆర్.

 • కిరికిరి గాళ్ళకు పంచాయతీ లు పెట్టకుండా ధరణి పోర్టల్ ను రూపొందించాము.
 • కుటుంబ పెద్ద చనిపోతే వారి ఆస్తిని ఎవరికి రాయాలి అనేది కుటుంబ సభ్యులకు అధికారం ఇచ్చాము.
 • రిజిస్ట్రేషన్ లు ఆగవు తహశీల్దార్ లేకపోతే డిప్యూటీ తహశీల్దార్ లు రిజిస్ట్రేషన్ లు చేస్తారు.
 • ధరణి పోర్టల్ ప్రభావం పక్క రాష్ట్రాల పై కూడా పడుతుంది…పడింది చాలా రాష్ట్రాల వారు నాకు ఫోన్ లు చేస్తున్నారు పోర్టల్ బాగుంది అని కితాబు ఇస్తున్నారు.
  *రెవెన్యూ డిపార్ట్మెంట్ చాలా పనులు చేస్తుంది.అందరూ చెడ్డ వాళ్ళు కారు.
 • రెవెన్యూ సంస్కరణలు చేసింది సాలర్జంగ్…అప్పుడు జరిగిన భూ సంస్కరణలు మళ్ళీ ఇప్పటి వరకు భూ సర్వే జరగలేదు.
 • పీవీ నరసింహారావు, ఎన్టీఆర్ భూ సంస్కరణలు చేశారు.ఐటీ మేమే తెచ్చాము అని చెప్పుకునే ముఖ్యమంత్రులు రెవెన్యూ లో ఐటీ ని తీసుకు రాలేదు.
 • తెలంగాణ ప్రభుత్వం ఐటీ ని తీసుకు వచ్చింది.
 • రాష్ట్రం మొత్తం ఇంచు కూడా వదలకుండా భూ సర్వే చేస్తాము.అందరికి హద్దులు ఏర్పాటు చేస్తాము.
 • కాళేశ్వరం ద్వారా చాలా చెరువులు నిండినయ్.వర్షాలు పడి చెరువులు పడ్డాయి.
  నీళ్లు ఎక్కువ ఉండడం తో నేను నా పంట ను కూడా కోయలేకపోయాను.
  *మేడ్చల్ లో కూరగాయలు పండించాడడానికి హర్టీ కల్చర్ లు ఆఫీసర్ లలను కూడా నియమిస్తాము..
 • కరోనా వచ్చి రాష్ట్ర ఆదాయం పడిపోయింది. కేంద్రం ఇచ్చే gst నిధులు కూడా ఇవ్వడం లేదు అయిన ప్రభుత్వ పథకాలు ఆపడం లేదు.
  కేసీఆర్ బ్రతికి ఉన్నన్ని రోజులు రైతు బంధు వస్తుంది.
 • రైతుల అకౌంట్ లో పైసలు నిల్వ ఉన్నప్పుడే నిజమైన బంగారు తెలంగాణ.
  *సాదా బైనామాలకు ప్రభుత్వం చిట్ట చివరి అవకాశం ఇచ్చింది దాన్ని సద్వినియోగం చేసుకోండి.
 • దాదాపు లక్ష 64 వేల సాదా బై నామాలు వచ్చాయి. ఇంకో వారం రోజుల పాటు సాదా బై నామాల డేట్ పెంచుతున్నాము.
 • పోడు భూములు, అటవీ, వక్ఫ్ భూములు
 • పోడు భూములకు పట్టాలు ఇప్పిస్తాం.
 • vro లను త్వరలో ఎక్కడో ఒక దగ్గర అడ్జస్ట్ చేస్తాము.
 • 95 శాతం కు పైగా రైతు వేదికలు పూర్తి అయ్యాయి.
 • రైతుల ఆత్మహత్యలు చూసి నేను ఏడ్చాను. రైతులకు ఎలాంటి బాధలు లేకుండా చేస్తాను.