Breaking News :

అలర్ట్: కెసిఆర్ హై లెవెల్ మీటింగ్ ఈరోజే

రాష్ట్రంలో పెరుగుతున్న మహమ్మారి కరోనా కేసుల దృష్ట్యా, ఈ వైరస్ నివారణ చర్యలకి రాష్ట్ర వ్యాప్తంగా లాక్ డౌన్ ని చాలా కఠినంగా అమలు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం పలు కీలకమైన నిర్ణయాలను తీసుకుంది. కాగా ప్రస్తుత పరిస్థితుల్లో కరోనా తీవ్రత తగ్గుముఖం పట్టిన కారణంగా కరోనా వైరస్ వ్యాప్తి, లాక్‌డౌన్, ఆర్థిక చర్యలు, ఆర్టీసీ, వ్యవసాయం.. తదితర అంశాలపై సీఎం కేసీఆర్ నేడు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. కాగా రాష్ట్రంలో ఈ నెల 29 వరకు లాక్ డౌన్ అమలులోఉంటుందని ప్రకటించిన సీఎం కేసీఆర్, ఈ లాక్ డౌన్ నుండి పలు రంగాలకు సడలింపులు విధిస్తు పలు కీలకమైన నిర్ణయాలు తీసుకోనున్నారు.

కాగా రాష్ట్రంలో కరోనా తీవ్రత బట్టి సడలింపులు ఉంటాయని, అందరికి కూడా న్యాయం చేసే విధంగా సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకోనున్నారని సమాచారం. కాగా ఈ క్రమంలో ముఖ్యంగా రాష్ట్రంలో ఆర్టీసీ బస్సుల రవాణా విషయంలో కీలకమైన నిర్ణయాన్ని తీసుకోనున్నారు. ఇకపోతే జీహెచ్‌ఎంసీ పరిధిలో మహమ్మారి కరోనా కేసుల సంఖ్య మరింత పెరుగుతున్న నేపథ్యంలో ఆ పరిధిలో బస్సులు నడిపే అవకాశం మాత్రం కనిపించడం లేదు. కాగా మరికొన్ని రోజులు రైళ్లు నడపకూడదని ప్రధాని మోడీ ఇది వరకే ప్రకటించగా, బస్సుల విషయంలో సీఎం కేసీఆర్ ఎలాంటినిర్ణయాలు తీసుకోనున్నారనేది ప్రస్తుతానికి చర్చనీయాంశంగా మారింది.

Read Previous

త్రివిధ దళాల సిబ్బంది పదవీ విరమణ వయస్సు పొడగింపు

Read Next

గ్రేట్..ఏపీ దిశ పోలీస్ స్టేషన్లకు అరుదైన గౌరవం